twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ న్యూస్ విని డిస్ట్రబ్ అయిన మహేష్ బాబు... ఆవేదనతో ట్వీట్!

    |

    ఒక మనిషికి ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటి ద్వారానే దేహానికి ప్రాణవాయివు అందుతుంది. వాటికి ఏమైనా హాని జరిగితే మనిషి ప్రాణానికే ప్రమాదం. మరి ఈ ప్రపంచానికి ఊరిపి‌తిత్తుల్లాంటి ప్రదేశం, ఈ విశ్వం మొత్తంలో ఉండే ఆక్సీజన్లో 20 శాతం ప్రొడ్యూస్ అయ్యే ప్రాంతం నాశనం అయితే.... ప్రపంచ మానవాళికే ముప్పు.

    'లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్'గా పిలిచే అమేజాన్ రెయిన్ పారెస్ట్ ప్రమాదంలో పడింది. కారణం ఏమిటో తెలియదు కానీ అడవిలో మంటలు చెలరేగి ప్రాణవాయువు అందించే లక్షలాది చెట్లు కాలి బూడిదవుతున్నాయి. పర్యావరణాన్ని ప్రేమించే వారిని ఈ వార్త చాలా డిస్ట్రబ్ చేస్తోంది. ఇలా డిస్ట్రబ్ అయిన వారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు.

    ఆవేదన వ్యక్తం చేస్తూ మహేష్ బాబు ట్వీట్

    ఆవేదన వ్యక్తం చేస్తూ మహేష్ బాబు ట్వీట్

    అమేజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈ భూమికి ఊపిరితిత్తుల్లాంటి ప్రదేశం. ప్రపంచంలో ఉండే మొత్తం ఆక్సీజన్లో 20 శాతం ఈ అడవుల నుంచే ఉత్పత్తి అవుతుంది. మనకు ప్రాణవాయువు అందించే ఈ అడవులు కాలిపోతున్నాయి. ఈ వార్త నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. మనం మేలుకోవాల్సిన సమయం ఇది... అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    మన భూమిని కాపాడుకుందాం

    మన భూమిని కాపాడుకుందాం

    అమేజాన్ అడవులు కాలిపోతున్నాయి... జీవవైవిధ్యానికే ఇది ముప్పు. మన భూమిని రక్షించుకోవడానికి మన వంతు కృషి చేద్దాం. గో గ్రీన్ దిశగా అడుగులు వేద్దాం. అది మన ఇంటి నుంచే ప్రారంభిద్దా అంటూ మహేష్ బాబు తన అభిమానులకు పిలుపునిచ్చారు.

    మహేష్ బాబు పిలుపుతో అభిమానుల్లో స్పందన

    మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వేల సంఖ్యలో ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. #PrayfortheAmazon యాష్ ట్యాగ్ వైరల్ చేశారు. పలువురు ఫ్యాన్స్ మహేష్ బాబు పిలుపు మేరకు చెట్లు నాటేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    మహేష్ బాబు

    మహేష్ బాబు

    మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ తొలిసారి ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించబోతున్నారు. అనిల్ సుంకర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    English summary
    "Deeply disturbing news... the #AmazonRainforest, rightfully called the 'lungs of our planet'... contributing to 20% of the world's oxygen is on fire!!! This is a wake-up call for all of us who are taking our planet for granted... #PrayfortheAmazon. The lungs of our planet are burning... the biodiversity is suffering. Let's do our bit to protect our earth... take a step forward to go green. Let's start at home!" Mahesh Babu tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X