రామ్ చరణ్ అల్లు అర్జున్ మల్టీస్టారర్.. టైటిల్ కూడా ఫిక్స్ అంటూ నిర్మాత కామెంట్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేనివిధంగా సరికొత్త కాంబినేషన్స్ తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. అయితే భవిష్యత్తులో మల్టీస్టారర్ సినిమాలు కూడా మరింతగా వచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. ఇదివరకే దర్శకధీరుడు రాజమౌళి మెగా నందమూరి హీరోలతో కలిపి RRR సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే మెగా హీరోలు రామ్ చరణ్ అల్లు అర్జున్ కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లు నిర్మాత అల్లు అరవింద్ చెప్పకనే చెప్పేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మెగా మల్టీస్టారర్

మెగా మల్టీస్టారర్

మెగా హీరోలు కలిసి సినిమా చేస్తే చూడాలి అని వారి అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే మధ్యమధ్యలో గెస్ట్ పాత్రలు తప్పితే ఇంతవరకు పూర్తిస్థాయిలో ఆ ఫ్యామిలీలోని హీరోలు మల్టీ స్టార్ సినిమాలు చేయలేదు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ చేస్తారు అని అనుకున్నప్పటికీ కూడా ఆ కాంబినేషన్ అయితే సెట్ కాలేదు.

 ఎవడు సినిమాలో

ఎవడు సినిమాలో

ఇక రీసెంట్ గా నిర్మాత అల్లు అరవింద్ ఆలీతో సరదాగా షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. అల్లు అర్జున్ చరణ్ కోసం మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే గతంలోనే వీరు ఇద్దరు ఎవడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కానీ ఇద్దరి కలయికలో సీన్స్ ఉండవు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఆ సినిమాలో అల్లు అర్జున్ కేవలం ఒక గెస్ట్ పాత్రలో మాత్రమే కనిపించాడు.

అల్లు అరవింద్ కామెంట్

అల్లు అరవింద్ కామెంట్

ఎవడు సినిమా అప్పట్లో భారీ అంచనాలను క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది. అయితే పూర్తిస్థాయిలో వారి కలయికలో సినిమా వస్తే బాగుంటుంది అని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్న సమయంలో నిర్మాత అల్లు అరవింద్ ఒక విషయమైతే చెప్పారు. చాలాకాలంగా వారిద్దరి కోసం కథలు కూడా వెళుతున్నట్లు చెప్పారు.

టైటిల్ ఫిక్స్.. కానీ..

టైటిల్ ఫిక్స్.. కానీ..


ఒకవేళ ఇద్దరు సినిమా చేస్తే గనక 'చరణ్ అర్జున్' అనే టైటిల్ కూడా పెట్టడానికి ఫిక్స్ అయినట్లు ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. టైటిల్ అనుకున్నప్పటికి ఆ హీరోల స్టార్ డం తగ్గట్టుగా సరైన కథ మాత్రం దొరకడం లేదు అని కూడా ఆయన అన్నారు. ఇక ప్రస్తుతం అయితే వారి స్టార్ హోదా మరింత ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి బలమైన కథతో పాటు దాన్ని తీసుకువచ్చే దర్శకుడు కూడా చాలా స్టామినాతో ఉండాలి అని అల్లు అరవింద్ అన్నారు. మరి భవిష్యత్తులో వీరి కోసం ఏ దర్శకుడు కథను సిద్ధం చేస్తాడో చూడాలి.

బిగ్ సినిమాలతో బిజీగా..

బిగ్ సినిమాలతో బిజీగా..

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే పుష్ప సెకండ్ పార్ట్ 2 బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మరోవైపు రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా భారీ స్థాయిలోనే విడుదల కాబోతోంది. ఇక ఈ హీరోలు కలిసి సినిమా చేస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులు అన్నీ కూడా బ్రేక్ అవుతాయి అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X