అల్లు అర్జున్‌తో విభేదాలు.. అల్లు అరవింద్‌ను ఎదిరించి.. బన్నీ వాస్ ఎమోషనల్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ చేసిన పని ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. నాడు సొంత మేనమావ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాకుండా కూటమికి బద్ధ వ్యతిరేకి అయిన వైఎస్ జగన్ పార్టీ అభ్యర్ధికి మద్ధతుగా ప్రచారం చేశారు. ఇది మెగా అభిమానులు, టీడీపీ- జనసేన కేడర్‌ను టోటల్‌గా తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. మేనమావ కోసం ట్వీట్ చేయడమేంటీ.. ఎవరో ఫ్రెండ్‌ ఇంటికి పర్సనల్‌గా వెళ్లడమేంటీ అంటూ బన్నీపై ట్రోలింగ్ జరిగింది.

ఎన్ని విమర్శలొచ్చినా సరే అల్లు అర్జున్ స్పందించలేదు. నా అన్నవారు ఏ పార్టీలో ఉన్నా, ఎవరైనా సరే వారి కోసం నిలబడతానని ఐకాన్ స్టార్ స్పష్టం చేశారు. మేనమావ పవన్ కళ్యాణ్ అయినా, మామగారు చంద్రశేఖర్ రెడ్డి అయినా, మిత్రుడు శిల్పా రవి అయినా తనకు సమానమేనన్నారు. ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధం లేదని.. పాలిటిక్స్‌లోకి రావాలన్న ఆలోచన , ఉద్దేశ్యం తనకు లేవని బన్నీ కుండబద్ధలుకొట్టారు.

producer bunny vasu praises icon star allu arjun s character and humanity at narne nithin s aay pre release event

నమ్ముకున్న వారి కోసం, ప్రాణస్నేహితుల కోసం అల్లు అర్జున్ నిలబడతారని.. కష్టమొస్తే ఆదుకుంటారని ఆయనను దగ్గరి నుంచి చూసిన వారు చెబుతుంటారు. తాజాగా ఇదేరకమైన వ్యాఖ్యలు చేశారు నిర్మాత బన్నీ వాసు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన మెగా- అల్లు కాంపౌండ్‌కు అత్యంత సన్నిహితుడు. సినిమాలపై విశ్లేషణ, వ్యాపార సూత్రాలపై పట్టుండటంతో అల్లు అరవింద్ జీఏ2 పిక్చర్స్ పేరిట బన్నీ వాసుని నిర్మాతను చేశారు.

అల్లు అరవింద్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని బన్నీ వాసు.. ఎంతో కష్టపడుతూ, టాలీవుడ్‌లో మంచి అభిరుచిగల నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ' ఆయ్‌ ' మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. నయన్ సారిక హీరోయిన్‌గా అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ ఈవెంట్‌లో బన్నీ వాసు మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ని ఆకాశానికెత్తేశారు. తన జీవితంలో కష్టం వచ్చిందంటూ ఇద్దరు వ్యక్తులు ముందుంటారని.. ఒకరు మా అమ్మ అయితే , రెండో వ్యక్తి అల్లు అర్జున్ అని తెలిపారు. ఆయ్ ప్రమోషన్ సరిగా జరగడం లేదని, బన్నీ చేత ఓ పోస్ట్ పెట్టించాలని మా వాళ్లు అడిగారని .. కానీ దీనికి తాను ఒప్పుకోలేదన్నారు. అయితే నేనేం చెప్పకుండానే బన్నీ తన ఎక్స్‌ ఖాతాలో ఈ సినిమా గురించి ట్వీట్ పెట్టారని బన్నీ వాస్ తెలిపారు.

ఒక స్నేహితుడికి కష్టమొస్తే , ఎలా ఆదుకోవాలో తెలిసిన ఏకైక వ్యక్తి నా జీవితంలో అల్లు అర్జునే అని అన్నారు. సరిగ్గా 20 ఏళ్ల కిత్రం నేను చేసిన చేసిన ఓ మిస్టేక్ వల్ల గీతా కాంపౌండ్‌నే వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు .. బన్నీ నా కోసం అల్లు అరవింద్ గారినే ఎదిరించారని వాసు చెప్పారు. నా ఒక్కడి విషయంలోనే కాదు.. స్నేహితుల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అల్లు అర్జున్ అండగా నిలుస్తాడని.. అది ఆయన మంచి మనసుకు నిదర్శనమని బన్నీ వాసు ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X