మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌పై వీడిన ఉత్కంఠ!
Game Changer: గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'గేమ్ ఛేంజర్'.ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి లీడ్ రోల్ కనిపించనున్నది. ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించిన షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయినట్లు ఇటీవల మూవీ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్న టైంకే విడుదల అవుతుందనే సమయంలో మూవీ విడుదలకు సంబంధించిన పలు రూమర్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకా ఫ్యాచ్ వర్క్ అలానే ఉండని, కొన్ని సీన్స్ సరిగా రాలేదనీ, రామ్ చరణ్ తో మరోసారి యాక్షన్ సీన్స్ రీ షూట్ చేయబోతున్నారంటూ పలు ఊహాగానాలు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు వస్తుందో.. అనుకున్న సమయానికి విడుదల అవుతుందా? అనే డైలామాలో పడిపోయారు మెగా ఫ్యాన్స్.
నిజానికి ఆర్ఆర్ఆర్ వంటి బాస్ట్ బస్టర్ హిట్ తరువాత రామ్ చరణ్ ఖాతాలో అలాంటి మూవీ సక్సెస్ పడలేదు. ఎలాగైనా తన అకౌంట్ లో మరో హిట్ వేసుకోవాలని చెర్రీ స్టార్ డైరెక్టర్ శంకర్ తో జత కట్టారు. ఇలా వీరిద్దరి క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ అనగానే.. ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ పడబోతుందని ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే చెర్రీ కూడా తన బెస్ట్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ మూవీ కోసం ఆయన దాదాపు 3 ఏళ్ల పాటు అంకితమైపోయారు. జూలై నెల ఆరంభంలో రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని డైరెక్టర్ శంకర్ నేరుగా మీడియాతో చెప్పారు.

పోస్ట్ ప్రొడక్షన్ వర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని ప్రకటించారు. అయితే.. భారతీయుడు 2 డిజాస్టర్ తో శంకర్ పై ప్రెషర్ పెరిగిందనీ, గేమ్ చేంజర్ లో ఏ చిన్న తప్పు కూడా ఉండకూడదని ప్రెస్టేజ్ గా తీసుకున్నారనీ, ఎడిట్ తరువాత హీరో రామ్ చరణ్ నటించిన కొన్ని సీన్లు మార్చాలని శంకర్ భావిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. మరోసారి రామ్ చరణ్ లో రీషూట్ చేయడం వల్ల గేమ్ ఛేంజర్ 2025లోనే రిలీజ్ అవుతుందని, పోస్ట్-ప్రొడక్షన్‌లో మరింత లేట్ అవుతుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని మూవీ మేకర్స్ చెక్ పెట్టారు. మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది.

గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టారు నిర్మాత దిల్‌రాజు. రామ్ చరణ్ లో కొన్ని సీన్స్ రీషూట్ చేయబోతున్నారని, గేమ్ ఛేంజర్ విడుదల 2025లోనే అనే వార్తలకు కొట్టిపారేశారు. మూవీ షూట్ పూర్తయిందనీ, ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ సినిమా శంకర్, రామ్ చరణ్‌ల ఇమేజ్‌లను మార్చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది భారత రాజకీయాల్లోని ఒక కోణాన్ని స్పృశిస్తుంది. ఈ మూవీ మెగా ఫ్యాన్స్ అలరిస్తుందని, పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈ వార్త వినగానే.. రిలీజ్ డేట్‌పై ఇక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడమే ఆలస్యమని తెలియడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మెగా ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











