Just In
- 53 min ago
సెట్లోకి వెళ్లేముందు అలా ఎంజాయ్.. విజయ్ దేవరకొండ వీడియో వైరల్
- 1 hr ago
అక్కడ తీసేసినా ఇక్కడ చాన్స్ దొరికింది.. కొత్త ఊపుతో యాంకర్ వర్షిణి బ్యాక్
- 1 hr ago
Box office: అల్లరి నరేష్ 'బంగారు బుల్లోడు' మొదటి రోజు కలెక్షన్స్.. నిజంగా ఇది పెద్ద షాక్!
- 2 hrs ago
విజయ్ దేవరకొండ 'లైగర్' వచ్చేది ఎప్పుడంటే.. పూరి జగన్నాథ్ జెట్ స్పీడ్ షూటింగ్
Don't Miss!
- News
జగన్కు ఆయుధాలిచ్చిన నిమ్మగడ్డ -ఆ వ్యాఖ్యలతో ఎస్ఈసీ ఇరుక్కుపోయారా? -సుప్రీంకోర్టులో వ్యూహం ఇదే!
- Lifestyle
ముఖాన్ని అందంగా మార్చడానికి ఐస్ క్యూబ్ ఫేషియల్ మసాజ్
- Sports
ఇష్టం వచ్చిన వాళ్లను పిలవడానికి ఇదేమైనా నా అత్తగారిల్లా.. సిరాజ్!
- Finance
ఆ టార్గెట్ చేరుకోవాలంటే ఇలా చేయాలి: నిర్మలకు మొబైల్ ఇండస్ట్రీ
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ సినిమాకు సీక్వెల్.. మరోసారి ఆ కాంబో హిట్టు కొట్టగలదా?
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మహేష్ కెరీర్ మొదట్లో బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వడానికి ఎంతగానో కష్టపడ్డాడు. ఎంతగానో నమ్మకం పెట్టుకున్న కొన్ని సినిమాలు ఊహించని విదంగా దెబ్బ కొట్టాయి. అయితే కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మాత్రం ఒక్కడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి.

ట్రెండ్ సెట్ చేసిన ఒక్కడు
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ మూడు సినిమాలు చేశాడు. సైనికుడు, అర్జున్ అంతగా ఆడలేదు. కానీ మొదట చేసిన ఒక్కడు మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేసింది. సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇక ఆ సినిమా తరువాత మహేష్ అగ్ర హీరోల జాబితాలోకి చేరాడు. యంఎస్.రాజు ఆ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే.

గోపీచంద్ విలన్ గా..
ఆ సినిమా విజయం సాధిస్తుందని అనుకున్నారు గాని మరీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేంతల సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు. రాయలసీమ, పాతబస్తీలో బ్యాక్ గ్రౌండ్ లో కబడ్డీ ఆటను మిక్స్ చేసి మంచి లవ్ స్టోరీని కూడా ప్రజెంట్ చేసిన గుణశేఖర్ స్థాయి కూడా ఆ సినిమాతో అమంతగా పెరిగిపోయింది. మొదట ప్రకాష్ రాజ్ చేసిన విలన్ పాత్రకు గోపిచంద్ ను అనుకోగా చివరి నిమిషంలో చేంజ్ చేయాల్సి వచ్చిందట.

17 ఏళ్ల తరువాత సీక్వెల్..
ఇక సరిగ్గా 17 ఏళ్ళ తరువాత సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై చర్చలు మొదలైనట్లు టాక్ అయితే గట్టిగానే వస్తోంది. నిర్మాత యంఎస్.రాజు ఒక్కడు 2 కాంబినేషన్ ను మళ్ళీ భారీ స్థాయిలో సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సీక్వెల్ కు మహేష్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక దర్శకుడు గుణశేఖర్ కూడా రెండవసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా అనేది మరొక పెద్ద సందేహం.

మళ్ళీ ఆ కాంబో సెట్టవుతుందా?
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా అయిపోతే వెంటనే మరో బిగ్ బడ్జెట్ సినిమాను కూడా లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ క్రమంలో యంఎస్.రాజు కూడా ఒక్కడు 2పై మహేష్ తో చర్చించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం అనే సినిమా చేస్తున్నాడు. మరి ఈ కాంబోలో ఒక్కడు వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.