ఎన్టీఆర్ దేవర ప్లాన్ మాములుగా లేదుగా.. స్టార్ ప్రొడ్యూసర్ చేతుల్లో నార్త్ ధియేట్రికల్ రైట్స్!

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఎదురుచూస్తున్న కొద్ది సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావలసి ఉంది, కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వస్తోంది. దసరా కానుకగా ఇప్పుడు అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నాం అంటూ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి నార్త్ ఇండియన్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎన్టీఆర్ దేవర సినిమాకి, బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా.. అక్కడే ఉంది దేవర మూవీ టీం మైండ్ బ్లోయింగ్ ప్లాన్. జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని మంచి హిట్ కొట్టాలనే కసి మీద ఉన్న కొరటాల శివ.

Producer Karan Johar gives a big update on the movie Devara on social media

సినిమాని పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి మూవీ టీంతో కలిసి ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా నార్త్ థియేట్రికల్ రిలీజ్ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ని అప్రోచ్ అయ్యారు. కరణ్ జోహార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఈ గుడ్ న్యూస్ ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కూడా.

ఒక మాస్ తుఫాను మనందరినీ ముంచేయటానికి త్వరలోనే రాబోతుంది, దేవర సినిమాలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను, ఇండియన్ సినిమాలోని బిగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టారు.

Producer Karan Johar gives a big update on the movie Devara on social media

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు. కరణ్ జోహార్ లాంటి నిర్మాత బాలీవుడ్ లో దేవర ను రిలీజ్ చేస్తుండటంతో దేవర మూవీ టీం కూడా ఫుల్ ఖుషి గా ఉంది. నిజానికి ఈ సినిమా రిలీజ్ లేట్ అవ్వడం కూడా సినిమాకి బాగా కలిసి వచ్చింది. దసరా కానుకగా సినిమాని రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఇంకా ఆరు నెలలు టైం ఉంది.

ఈ లోపుగా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది అలాగే ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో చేయడానికి ఎక్కువగానే సమయం ఉంటుంది. బాలీవుడ్ లో ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేయాలని మూవీ టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X