టాలీవుడ్‌లో ఏ హీరోకూ దక్కని ఆఫర్ అందుకున్న పవన్.. పవర్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం.!

By Manoj Kumar P

పవర్ స్టార్ పవన్ కల్యాణ్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. పేరుకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అందుకే అతడు ఏ రంగంలో ఉన్నా.. అభిమానుల మద్దతు లభిస్తోంది. కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన.. మరోసారి ముఖానికి మేకప్ వేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. ఈ నేపథ్యంలోనే పవన్‌ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం.!

ప్రత్యేకంగా ఆలోచించిన పవన్ కల్యాణ్

ప్రత్యేకంగా ఆలోచించిన పవన్ కల్యాణ్

చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవన్ కల్యాణ్. వాస్తవానికి స్టార్ హీరో కమ్‌బ్యాక్ మూవీ అంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. అందుకు తగ్గట్లు ఆ సినిమాపై అంచనాలూ ఉంటాయి. అందుకే పక్కా కమర్షియల్ సినిమానే ప్రిఫర్ చేస్తారు హీరోలు. కానీ, పవన్ మాత్రం అందుకు భిన్నంగా అందరికీ తెలిసిన కథతో తన కమ్‌బ్యాక్ మూవీని చేస్తున్నారు.

అమితాబ్, అజిత్ తర్వాత పవర్ స్టారే

అమితాబ్, అజిత్ తర్వాత పవర్ స్టారే

బాలీవుడ్‌లో బంపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘పింక్'. అమితాబ్, తాప్సీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను తమిళంలోనూ రీమేక్ చేశారు. అక్కడ అజిత్ హీరోగా వచ్చిన ఈ సినిమాను ‘నెర్కొండ పార్వాయి' పేరుతో తెరకెక్కించారు. ఇప్పుడిదే మూవీని తెలుగులో పవన్ హీరోగా ‘వకీల్ సాబ్' అనే టైటిల్‌తో రూపొందిస్తున్నారు.

పవన్ మేనియాతో షేక్.. రికార్డుల బ్రేక్

పవన్ మేనియాతో షేక్.. రికార్డుల బ్రేక్

తాజాగా ‘వకీల్ సాబ్' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. నేచురల్‌గా కనిపిస్తున్న పవన్ లుక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దిల్ రాజు బ్యానర్‌లో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియానే షేక్ చేశారు. దీంతో భారతదేశం మొత్తానికి ‘వకీల్ సాబ్' ట్రెండ్ అయిపోయింది.

దిల్ రాజు చేసిన పని వల్లే ఇదంతా సాధ్యం

దిల్ రాజు చేసిన పని వల్లే ఇదంతా సాధ్యం

పవన్‌ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చాలా మంది ఫిల్మ్ మేకర్లు ఆయనతో సినిమా చేయాలని ప్రయత్నించారు. కానీ, ఆయన మాత్రం ముందుకు రాలేదు. అయితే, దిల్ రాజు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించాయి. ఈ సినిమా కోసం పవర్ స్టార్‌కు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పించారు. దీంతో ‘వకీల్ సాబ్' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 ఏ హీరోకూ దక్కని ఆఫర్ అందుకున్న పవన్

ఏ హీరోకూ దక్కని ఆఫర్ అందుకున్న పవన్

‘వకీల్ సాబ్'తో పాటు పవన్ కల్యాణ్... క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్‌తో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమా షూటింగ్‌లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. క్రిష్ సినిమా కోసం నిర్మాత ఏఎమ్ రత్నం, హరీశ్ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక విమాన సదుపాయం కల్పించాయని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది.

Recommended Video

Sid Sriram To Sing A Song For PSPK 26 | Thaman | Pawan Kalyan | Vakeel Saab | Filmibeat Telugu
పవర్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం.!

పవర్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం.!

ప్రస్తుతం పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లాలో ఉంటున్నారు. దీంతో షూటింగ్ కోసం హైదరాబాద్‌ రావాల్సి ఉంటుంది. అందుకే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన కోసం ప్రత్యేక విమానం పంపించారు. ఇప్పుడదే పనిని మిగిలిన వాళ్లు కూడా చేస్తున్నారట. ఈ వార్త లీక్ అవడంతో.. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకూ దక్కని అరుదైన ఆఫర్ పవన్ కల్యాణ్‌కు దక్కిందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X