ప్రభాస్ తో 500కోట్లతో సినిమా తీస్తున్న దర్శకుడు.. ఎవరు ఊహించని ఫొటోతో విషెస్!
పాన్ ఇండియా స్టార్ గా దేశ వ్యాప్తంగా చక్రం తిప్పుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎంతగానో ప్రేమ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఎదురుగా వచ్చాడు అంటే ప్రతి ఒక్కరు కూడా డార్లింగ్ అని పిలవకుండా ఉండలేరు. ప్రభాస్ కు నచ్చితే ఎంతటి చిన్న వారినైనా సరే చాలా స్నేహంగా చూస్తాడు. తన స్టార్ హోదా ను ఏమాత్రం లెక్కచేయకుండా అందరినీ సమానంగా చూసే ప్రభాస్ అంటే అభిమానులు కూడా ఎంతో ప్రాణం. ఇక నేడు 42వ పుట్టినరోజు సందర్భంగా దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులు అందరి హీరోల అభిమానులు కూడా డార్లింగ్ కోసం ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ అయితే ఎవరూ ఊహించని విధంగా ఒక ఊర మాస్ ఫోటోని షేర్ చేస్తూ తన విషెస్ ను అందించాడు.

బాహుబలి ప్రభావం
బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులు బ్లాక్ చేసేలా ఉంటాయి అని ఈజీగా అర్థమైపోయింది. 100 కోట్లతో నిర్మించాలని అనుకున్న సినిమాల బడ్జెట్ కూడా బాహుబలి సక్సెస్ అనంతరం ఒక్కసారిగా రెండు వందల కోట్లకు పైగా చేరుకున్నాయి.

రెగ్యులర్ గా కాకుండా..
ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు అని చాలా క్లారిటీ గా అర్థమవుతోంది. ఇక డార్లింగ్ కూడా చాలా విభిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ అగ్ర హీరో కూడా అలాంటి సినిమాలను లైన్ లో పెట్టలేదు. రెగ్యులర్ గా కాకుండా విభిన్నంగా ప్రేమకథలను చారిత్రాత్మక కథలను అలాగే సైన్స్ ఫిక్షన్ కథలను కూడా ఓకే చేస్తున్నాడు. ఒక విధంగా అతను చేయబోయే సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ స్టామినా మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.

ఆటో వెనకాల ఉండే ఫొటోతో విషెస్
ఇక నేడు ప్రభాస్ 42వ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా సినీ ప్రముఖులు స్పెషల్ గా బర్త్ డే విషెస్ ను అందిస్తున్నారు. ఇక ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రభాస్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ తో ప్రాజెక్టు K అనే సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఆటో వెనకాల ఉండే ప్రభాస్ ఫోటోను షేర్ చేసుకున్నాడు.

ప్రభాస్ తో 500కోట్ల సినిమా..
ఎక్కడ చూసినా హ్యాపీ బర్త్ డే ప్రభాస్. గ్లోబల్ ప్రభాస్ డే. అతితక్కువ మంది నటులు మాత్రమే ఈ స్థాయులో ప్రేమను గౌరవాన్ని అందుకుంటారు. అలాంటిది మీరు దక్కించుకున్నారు సర్. మీతో అడ్వెంచర్ ను స్టార్ట్ చేసేందుకు నేను వెయిట్ చేయలేకపోతున్నాను.. అంటూ నాగ్ అశ్విన్ ఒక సాధారణ ఆటో వెనకాల ఉన్న ప్రభాస్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ప్రభాస్ తో సినిమా చేసే ప్రతీ దర్శకుడు కూడా స్టైలిష్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటే 500కోట్ల విలువైన ప్రాజెక్ట్ Kను తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్ మాత్రం ఇంత సింపుల్ గా ఆలోచించడం ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











