Project K: ఖరీదైన కార్లతో ప్రభాస్ యాక్షన్ సీన్స్.. హాలీవుడ్ రేంజ్ లో డైరెక్టర్ బిగ్ ప్లాన్!

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుసగా రెండు సినిమాలతో నిరాశపరిచిన విషయం తెలిసిందే. సాహో సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన లవ్ అడ్వెంచర్ మూవీ రాధే శ్యామ్ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాల అనంతరం ప్రభాస్ ఎలాగైనా తన తదుపరి సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాడు.

అయితే ప్రస్తుతం అభిమానుల ఫోకస్ ఎక్కువగా ప్రాజెక్టు K పైనే ఉంది. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతానికి పైగా పూర్తయింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. అయితే ఆ షూటింగ్లో ప్రభాస్ దీపికా పదుకొనే ఇద్దరు పాల్గొన్నారు. ఖరీదైన కొన్ని లగ్జరీ కార్లతో చేజింగ్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

project K movie latest shooting update chasing scenes on prabhas

ఈ షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఫెరారీ లాంబోర్ఘోని కార్లను కూడా తీసికువచ్చారు. సినిమా మొత్తంలో ఈ చేజింగ్ సీన్ చాలా హైలెట్ గా ఉండబోతుందట. గతంలో జేమ్స్ బాండ్ సినిమాలలో ఎలాగైతే కార్లతో చేయింగ్ సన్నివేశాలను చిత్రీకరించారో ఇప్పుడు ప్రాజెక్టు కే కోసం కూడా అదే తరహా షూట్ చేస్తున్నట్లు సమాచారం. నిర్మాత సి.అశ్వినీ దత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువస్తున్నారు. దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే హాలీవుడ్ లో కూడా సినిమాను విడుదల చేయాలి కాబట్టి ఖర్చు విషయంలో అయితే నిర్మాత ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుంది అని ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో మంచి యాక్షన్ సన్నివేశాలతో పాటు భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా మంచి సందేశం కూడా ఉంటుందట. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఫైనల్ గా ప్రాజెక్టు K సినిమాను 2024 చివరలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X