పూరి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్.. 'ఇస్మార్ట్ శంకర్'గా మారిపోయిన రామ్!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ పూరికనెక్ట్స్ బ్యానర్ లో నిర్మించనున్నారు. సీనియర్ హీరోయిన్ చార్మి ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనుంది. పూరి జగన్నాథ్, హీరో రామ్ కెరీర్ కు ఈ చిత్రం చాలా కీలకం. వరుస పరాజయాల్లో ఉన్న వీరిద్దరూ ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో సినిమా ప్రారంభించారు.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేశారు. 'ఇస్మార్ట్ శంకర్' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పూరి జగన్నాథ్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా వైరైటీగా ఉంది. హీరో రామ్ తలకిందులుగా ఉన్న లుక్ ని విడుదల చేశారు. స్టైలిష్ హెయిర్ స్టైల్, గడ్డంతో రామ్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. సిగరెట్ తాగుతూ బ్యాడ్ బాయ్ లా ఉన్నాడు. పూరి జగన్నాథ్ సినిమాలో దాదాపుగా హీరోల బాడీ స్టైల్ ఇలానే ఉంటుంది.

కానీ రామ్ తలలో డ్యూయెల్ సిమ్ కార్డు అని కూడా ఉంది. మొత్తంగా రామ్, పూరి కాంబినేషన్ లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఆసక్తిని పెంచే విధంగా ఉంది. హైదరా బ్యాడ్డి అనే హ్యాష్ ట్యాగ్ తో రామ్ మోషన్ పోస్టర్ విడుదల చేశాడు. ఈ చిత్ర మరో పోస్టర్ పై డబుల్ దిమాక్ హైదరాబాది అని కూడా ఉంది. హీరోయిన్, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు, సాంకేతిక వర్గానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











