నాలో మంచోడిని చూసి బోర్ కొట్టిందా.. ఇప్పుడు బ్యాడ్ బాయ్‌ని చూడండి!
హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి నిన్ననే అధికారిక ప్రకటన వెలువడింది. చార్మి ట్విట్టర్ లో వెల్లడిస్తూ పూరిజగన్నాథ్ తన సొంత బ్యానర్ పూరి కనెక్ట్స్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిపింది. చార్మి ఈ చిత్రానికి కోప్రొడ్యూసర్. తాజాగా రామ్ ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు అందించాడు.
నన్ను మంచివాడిగా చూసి బోర్ కొట్టిందా.. అయితే ఇప్పుడు చెడ్డవాడిగా చూడండి అంటూ రామ్.. పూరి, చార్మితో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశాడు. నా అభిమాన దర్శకుడు పూరి జగన్నాథ్ తో సినిమా చేయబోతున్నా. బోల్డ్ కంటెంట్ తో ఈ చిత్రం రాబోతుంది అని రామ్ తెలిపాడు. రామ్ ఈ చిత్రం కోసం గెటప్ మొత్తం మార్చేస్తున్నారు. రామ్ లేటెస్ట్ లుక్ చాలా కొత్తగా ఉంది.

రామ్ నటిస్తున్న 17వ చిత్రం ఇది. ఈ చిత్రంలో రామ్ సరసన నటించే కథానాయిక ఎవరు.. సంగీత దర్శకుడు లాంటి వివరాలన్నీ త్వరలో తెలియనున్నాయి. ఈ ఏడాది రామ్ నుంచి హలొ గురు ప్రేమ కోసమే చిత్రం వచ్చింది. ఈ చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక పూరి చివరగాతెరక్కించిన మెహబూబా దారుణంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీనితో పూరి, పూరి రామ్ తమ కొత్త చిత్రంపై గట్టిగానే దృష్టి పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











