హీరో రామ్ కొత్త లుక్.. డాషింగ్ డైరెక్టర్ కోసమేనా!
ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కు ఇటీవల సరైన విజయం దక్కడం లేదు. రామ్ చివరగా నటించిన హలో గురు ప్రేమకోసమే చిత్రం పరవాలేదనిపించింది. రామ్ ప్రస్తుతం కొత్త చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల రామ్ సోషల్ మీడియాలో స్టైలిష్ పిక్‌ని పోస్ట్ చేశాడు. రామ్ కొత్త లుక్ అదరగొడుతోంది.
హీరో రామ్ ప్రతి చిత్రంలో స్టైలిష్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ కొత్త లుక్ తదుపరి చిత్రం కోసమే అనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనే విషయంలో కూడా ఫిలిం నగర్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ త్వరలో రామ్‌తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పూరి జగన్నాథ్‌కు కూడా ఇటీవల సరైన విజయం లేదు. పూరి వినిపించిన కథ నచ్చడంతో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హీరోలని పూరి జగన్నాథ్ డిఫెరెంట్ స్టైల్‌లో చూపిస్తారు. వీరిద్దరికి అర్జెంట్‌గా ఓ హిట్టు అవసరం. టెంపర్ తర్వాత పూరికి, నేను శైలజ తరువాత రామ్ కు హిట్ లేదు.


Click it and Unblock the Notifications











