కొడుకు కోసం పూరి జగన్నాథ్ కసరత్తు.. ఈ సారి గురి తప్పకుండా!
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి చివరగా నటించిన చిత్రం మెహబూబా. కొడుకు కోసం స్వయంగా పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శత్వం వచించారు. అయినా కూడా మెహబూబా చిత్రం ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రం తరువాత పూరి జగన్నాథ్ మరో సినిమా ప్రారంభించలేదు. తాజాగా ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.
పూరి జగన్నాథ్ ఆకాష్ పూరి తదుపరి చిత్రం కోసం భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పూరి జగన్నాథ్ తన ఆఫీస్ లో అద్భుతమైన కథ రూపొందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాని ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శత్వం వహించరని ఆ భాధ్యతల్ని ఓ డెబ్యూ దర్శకుడికి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూరి జగన్నాథ్ ఈ చిత్రంలో నిర్మాణ భాద్యతలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మెహబూబా తీవ్రం గా నిరాశపరచడంతో మరో మారు అలాంటి పొరపాట్లు జరగకూడదని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











