Vijay devarakonda: మరో సినిమాను మొదలు పెట్టబోతున్న పూరి.. ఫస్ట్ ప్లాన్ రెడీ!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత తన ఆలోచనా విధానాన్ని ఒక్కసారిగా మార్చేశాడు అనే చెప్పాలి. అప్పటివరకు మాస్ కమర్షియల్ సినిమాలను తనదైన శైలిలో అందించిన పూరి జగన్నాథ్ మొదటిసారి లైగర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాడు. విజయ్ దేవరకొండకు కూడా ఇదే మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. విజయ్ దేవరకొండ తోనే పూరి జగన్నాథ్ మరో సినిమాను మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇక పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి జనగణమనను సెట్స్ పైకి తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కు సంబంధించి మొదటి ప్లాన్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది పూర్తి వివరాల్లోకి వెళితే...
లైగర్ సినిమాను కేవలం తెలుగు హిందీలోనే తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ తరువాత ప్రాజెక్టులోకి మరో అగ్ర నిర్మాత కరణ్ జోహార్ వచ్చి చేరడంతో ప్రాజెక్టును పాన్ ఇండియా సినిమాగా తీసుకురావాలని ఒక్కసారిగా ప్లాన్ మొత్తం చేంజ్ చేశారు. మొత్తానికి లైగర్ సినిమా షూటింగ్ అయితే పూర్తయింది. బాక్సింగ్ నేపథ్యంలో క్రిక్ ఎక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో విజయ్ దేవరకొండ నేషనల్ బాక్సర్ గా కనిపించనుండగా సెకండాఫ్ లో ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో వున్నారు. ఇక ఆగస్టు నెలలో సినిమాను విడుదల చేయబోతున్నారు.

అయితే లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ చాలా నమ్మకం ఏర్పరుచుకున్నాడు. దీంతో పూరి జగన్నాథ్ ఆ తర్వాత మరో సినిమాను కూడా తనతోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. గత 15 ఏళ్లుగా పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాను. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అలాగే మరికొంత మంది స్టార్ హీరోలు కూడా చెప్పాడు కానీ ఎందుకో మరి ఆ ప్రాజెక్టు చర్చల దశలోనే ఆగిపోయింది. ఇక ఈసారి విజయ్ దేవరకొండ తో మాత్రం ఎలాగైనా తన అనుకున్న ప్రాజెక్టును చాలా స్పీడ్ గా తెరపైకి తీసుకు రావాలి అని పూరి జగన్నాథ్ మొండిగా ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక తొలి షెడ్యూల్ ను కు సంబంధించిన లొకేషన్స్ కూడా వెతికే పనిలో పడ్డట్లు తెలుస్తుంది. ఇప్పటికే లైన్ ప్రొడ్యూసర్ మాజీ హీరోయిన్ ఛార్మి కూడా సౌతాఫ్రికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడే ఆమె కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ ని చూసినట్లుగా సమాచారం. మొదటి ప్లాన్ లో బాగంగా 20 శాతం షూటింగ్ ను అక్కడే షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడ షూట్ పూర్తయిన అనంతరం మిగతా షూట్ ను ఇండియాలో పలు లొకేషన్స్ లో ఫినిష్ చేయడానికి రెడీ కానున్నారు. ఇక సినిమాను లైగర్ సినిమాతో పాటే పూర్తి చేసి విడుదలకు కూడా సిద్ధం చేసి ఉంచాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











