Allu Arjun: పుష్ప 2 కి అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లోలో తెలుసా?
Allu Arjun Remuneration: ఇండస్ట్రీలో ప్రతి హీరో రోజురోజుకు రేంజ్ ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా ప్రతి సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తున్న హీరోలలో అల్లు అర్జున్ మొదటి వరుసలో ఉంటారు. ఈ క్రమంలో తనను తాను అప్డేట్ చేసుకుంటూ.. వరుస హిట్స్ కొడుతున్నారు. ఇక పుష్ప 1 మూవీ హిట్ తో పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈ భారీ బ్లాక్ బస్టర్ మూవీకి సిక్వెల్ గా పుష్ప ది రూల్ (పుష్ప 2) అనే మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే.. మూవీ కోసం అల్లు అర్జున్ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' మూవీ అనేది ఎంతటి విజయం సాధించిందో చెప్పవలసిన అవసరం లేదు. ఇండస్ట్రీలో పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ స్థాయిలో తన బ్రాండ్ క్రియేట్ చేసుకొన్నారు. పుష్ప సంచలన విజయం ఆయనను ఇండియాలోనే స్టార్ హీరోగా నిలబెట్టింది. ఇక పుష్ప 2 సినిమాతో తన రేంజ్‌ను మరింత పెంచుకొన్నారు. ఈ భారీ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న 'పుష్ప 2' త్వరలో రానున్నది. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా కొట్లాదిమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఎర్రచందనం పగిలి నేపథ్యంలో పుష్ప సిరీస్ రూపుదిద్దుకున్న విషయం తెలిసింది. ఒక కూలిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన పుష్పరాజ్ ఎర్రచందనం సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడు? ఆ తరువాత పుష్ప రాజ్ ఎదురైన ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో 'పుష్ప ది రూల్' రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ థియేటిరికల్, నాన్ థియేటరికల్ గా.. దాదాపు వెయ్యి కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ బిజినెస్ జరిగినట్టు టాక్.
మరోవైపు.. పుష్ప 2 కు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇలా భారీస్థాయిలో బిజిసెన్ జరుగుతోందంటే.. అందుకు కారణం అల్లు అర్జున్ మానియా. పుష్ప మూవీతో బన్నికి దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ కారణంతోనే మూవీ నిర్మాతలు .. కోట్ల రూపాయలను కురిపిస్తున్నారు. అందుకు తగ్గట్టు పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందట. ఈ తరుణంలో పుష్ప సినిమాకు అల్లు అర్జున్ తీసుకొంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.

పుష్ప 2 మూవీ కోసం హీరో అల్లు అర్జున్ పార్టనర్స్ గా రెమ్యునేషన్ తీసుకోవాలని మొదటే అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ అగ్రిమెంట్ ప్రకారం..కొంత నగదు రూపంలోను, మరికొంత ప్రాఫిట్ షేరింగ్, హక్కుల రూపంలో తీసుకొన్నట్టు తెలుస్తున్నది. ఇలా దాదాపు 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. ఈ విషయం నిజమైతే..ఇప్పటిదాకా ఏ హీరోకు ఈ స్దాయి రెమ్యునరేషన్ అందుకోలేదు. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనికేషన్ తీసుకుంటున్న తెలుగు హీరోగా నిలుస్తాడు. ఆ తర్వాత స్థానం మిగతా రోలు నిలుస్తారు. ఇక పుష్ప 2 హిట్ అయితే అల్లు అర్జున్ రేంజ్ మరోస్థాయికి వెళ్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











