Unstoppable 4: జానీ మాస్టర్ వివాదంపై అల్లు అర్జున్ ఓపెన్! హర్ట్ అయ్యా.. బాలయ్యతో ఐకాన్ స్టార్ ఎమోషనల్!

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప ది రూల్ మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటికే దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటాయి. అయితే ఆ అంచనాలను మరింత పెంచడానికి భారీ ప్రమోషన్స్‌ను ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తమ సొంత ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే అన్‌స్టాపబుల్ సీజన్ 4 లోకి వచ్చి తనలోని అనుభూతులను పంచుకొన్నారు. అయితే అమ్మాయిల విషయంలో ఆయన చెప్పిన విషయంలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల సంచలనం రేపిన అంశం జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ్ జైలుకు రిమాండ్‌పై తరలించారు. అయితే జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలపై భిన్న కథనాలు, అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Pushpa 2 fame Allu Arjun open about Jani Master controversy in Balakrishna s Unstoppable 4 show

అయితే ఓ దశలో సోషల్ మీడియాలో జానీ మాస్టర్ వివాదం వెనుక ప్రధాన హస్తం అల్లు అర్జున్, సుకుమార్ ఉన్నారనే విషయం భారీ చర్చకు దారి తీసింది. బాధితురాలికి వెనక ఉండి సపోర్టు చేసింది వారిద్దరే అనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పుష్ప చిత్రమే ఈ వివాదానికి అసలు కారణమని చెప్పారు. అయితే చిత్ర యూనిట్ ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ.. ఎవరికి సంబంధం లేదని తేల్చేశారు.

కానీ జానీ మాస్టర్ వివాదం వెనుక అల్లు అర్జున్‌దే హస్తమని ట్రోలర్స్ గట్టిగా ప్రచారం చేసుకొన్నారు. దానికి తోడు ఝాన్సీ కూడా ఐకాన్ స్టార్ సపోర్టు ఉందని పరోక్షంగా క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదం మరింత జటిలంగా మారింది. ఆ తర్వాత ఈ వివాదంపై స్పందించడానికి అల్లు అర్జున్‌కు పెద్దగా అవకాశం దక్కలేదు. అయితే ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు అన్‌స్టాపబుల్‌ను వేదిక చేసుకొన్నారా? అనే విషయం తాజా ట్రైలర్‌లో స్పష్టం చేసింది.

Pushpa 2 fame Allu Arjun open about Jani Master controversy in Balakrishna s Unstoppable 4 show

అయితే బాలకృష్ణ అడిగిన ఓ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. నాకు అమ్మాయిలను విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే కోపం వస్తుంది. నేను ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ అమ్మాయిలకు ఏదైనా జరిగితే నేను చాలా హర్ట్ అవుతాను అని అల్లు అర్జున్ వెల్లడించారు. అయితే ప్రోమోలో కాబట్టి క్లారిటీ లేదు. కానీ ఫుల్ ఎపిసోడ్‌లో జానీ మాస్టర్ గురించే పరోక్షంగా ఈ వ్యాఖ్యలను చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, అనసూయ తదితరులు నటించిన ఈ సినిమాపై ఏ సినిమాపై లేనంతగా హైప్ క్రియేట్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌ను పాట్నాలో మొదలుపెట్టి, కోల్‌కతా, చెన్నై, కోచి, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 unstoppable 4
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X