Pushpa 2: ప్రభాస్‌ను నెట్టేసిన పుష్ప రాజ్... ఆ 5 సినిమాల కోసమే ఇప్పుడంతా వెయింటింగ్!
బహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయిందనే విషయం తెలిసిందే. అయితే వరుసగా సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ... ఆ రేంజ్ సక్సెస్ మాత్రం రావడం లేదు. తాజాగా ప్రభాస్ రేంజ్ ను పుష్ప రాజ్ దాటేశాడు. అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక ఈ సినిమాతో గ్లోబల్ రేంజులో క్రేజ్ కొట్టేశాడు బన్నీ. ఇక ఉత్తమ జాతీయ అవార్డు కూడా వచ్చేసింది అల్లు అర్జున్ కు. తాజాగా ఆర్మాక్స్ నిర్వహించిన సర్వేలో ప్రభాస్ ను పుష్ప రాజ్ నెట్టేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్.. రాజమౌళి తెరకెక్కించిన బహుబలి సినిమాతో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత చేసిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఆ స్థాయిలో ఆడకపోయినా.. ప్రభాస్ ఫేంతో వసూళ్లు మాత్రం వచ్చాయి. ఇక ప్రభాస్ సాలిడ్ హిట్ కొడితే చూడాలి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా ప్రభాస్ రేంజ్ ను అల్లు అర్జున్ క్రాస్ చేసేశాడని తెలుస్తోంది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ నిర్వహించిన సర్వేలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది.

ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తూ.. వాటికి సంబంధించిన లిస్టును రిలీజ్ చేస్తుంది. తాజాగా తెలుగులో మోస్ట్ వెయింటింగ్ చిత్రాలను రిలీజ్ చేసింది ఈ సంస్థ. ఇక అందులో మొదటి సినిమా పుష్ప ది రూల్ ఉంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అల్లు అర్జున్ క్రేజ్ జనాల్లోకి ఆ రేంజ్ లో పోయిందన్నమాట. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ నెలకోల్పిన హైప్స్ కూడా రెండో పార్ట్ పై ఆసక్తి రేపుతోంది.

రెండో స్థానంలో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఉంది. ఇక ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సలార్ కంటే కూడా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ అందులో క్లారిటీ లేదు.. వచ్చే ఏడాది సమ్మర్ లో రానుందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ సినిమా రెండో స్థానంలో ఉంది.

ఇక మూడో స్థానంలో మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నిలిచింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అందాల భామలు శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథనాయికలు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. మహేశ్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.
ఇక నాలుగవ స్థానంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్ 1. ఈ సినిమా కోరటాల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. తొలిసారిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో నటిస్తుంది. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రాగా.. మొదటి పార్టును వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఐదో స్థానంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ. సుజిత్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. అవండీ ఈ ఐదు సినిమాలు తెలుగులో మోస్ట్ వెయింటింగ్ లిస్టులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











