Pushpa 3: అల్లు అర్జున్ పుష్ప 3 పై నిర్మాత కీలక ప్రకటన.. సీక్వెల్ ఉన్నట్టేనా..?
Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సక్సస్ పుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన్ మూవీ 'పుష్ప2: ది రూల్'. మరో 45 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పుష్పగాడి రూలింగ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 24న)పుష్ప2 చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పాన్ ఇండియా స్థాయిలో మీడియాతో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో పుష్ఫ 3 గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్టేడ్ ఇచ్చారు. ఇంతకీ పుష్ప సిరీస్ లో మరో సిక్వెల్ రాబోతుందా? లేదా? ఓ లూక్కేయండి.
పుష్ప 2 ప్రెస్ మీట్ లో నిర్మాతలు మాట్లాడుతూ. పుష్ప 2 మూవీలో మెయిన్ పార్ట్ అయినా జాతర ఎపిసోడ్ ను 35 రోజులు షూట్ చేశామని, అందులో 10 నుండి15 రోజులు రియాల్సిస్ చేసేమని తెలిపారు. జాతర షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ పడిన కష్టం తనకు తెలిసి ఏ హీరో హీరో కూడా పడలేదని, సారీ కట్టుకుని, బాడీ మొత్తం మేకప్ వేసుకొని, దాదాపు 12 నుండి 13 గంటల పాటు మేకప్ వేసుకొని ఉన్నారని, ఆయన పడిన కష్టం కోసమైనా ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందని అల్లు అర్జున్ ను ప్రశంసించారు పుష్ప మూవీ నిర్మాత.

ఐటమ్ సాంగ్ లో ఎవరు నటిస్తున్నారని నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సాంగ్ లో ఎవరు నటించబోతున్నారని ప్రశ్నించగా.. వాస్తవానికి ఇంకా ఎవరు ఫైనలైజ్ కాలేదని, రెండు మూడు రోజుల్లో ఐటమ్ సాంగ్ లో ఎవరు నటించబోతున్నారనేది తామే ప్రకటిస్తామని వెల్లడించారు. ఆ సాంగ్ ఈ సినిమా షూటింగ్ చివరి పాటని, నవంబర్ 4 తేదీ నుండి ఆ సాంగ్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.
పుష్ప 2 మూవీ రిలీజ్ ముందే పలు రికార్డులను బ్రేక్ చేసిందని, రూ. 1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. దీనిపై మీ స్పందనేంటి అని ప్రశ్నించగా.. రూ. 1000 కోట్ల బిజినెస్ అనేది.. థియేటర్, నాన్ థియేటర్ బిజినెస్ గా ఉంటుందని, థియేటర్ గా మాత్రం పుష్ప 2క్రియేట్ చేసింది బిజినెస్ హైయెస్ట్ అని తెలియజేశారు.
పుష్ప 2 వల్ల గేమ్ చేంజర్ రిలీజింగ్ మూవీ డేట్స్ మార్పు మారాయని, మరి పుష్ప 2 రిలీజ్ డేట్ ఏమైనా మార్పు ఉంటుందా? అని ప్రశ్నించగా.. ఏ సినిమా అయినా రెండు వారాలు నడిస్తే.. 80 పర్సంటేజ్ నుండి 85 పర్సంటేజ్ కలెక్షన్స్ రాబడుతోందనీ, ఏ భారీ బడ్జెట్ సినిమాలకైనా ఇదే జరుగుతోందన్నారు ప్రొడ్యూసర్ రవి. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ డేట్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి.. మిగతా రోజుల్లో కూడా మూవీ కలెక్షన్ పెరగడానికి అవకాశం ఉంటుందని నిర్మాత తెలిపారు.

ఈ సమయంలో పుష్ప 2 కాకుండా పుష్ప3 తీయడానికి ప్లాన్ చేస్తున్నారా? అని ప్రశ్నించగా.. ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ.. మీరందరూ బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ చేస్తే.. త్రీ కూడా తీయబోతున్నామని ప్రకటించారు. అలాగే పుష్ప 2 లో కూడా సీక్వెల్ కి సంబంధించిన కొన్ని లీడ్స్ ఇచ్చామని, కచ్చితంగా పుష్ప సిరీస్ లో పుష్ప 3 కూడా రాబోతుందని పుష్ప ప్రొడ్యూసర్ తెలియజేశారు.
'పుష్ప2'కి కూడా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే పుష్ప2 నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











