పుష్ప పని ముగించనున్న అల్లు అర్జున్.. ఐకాన్ మొదలయ్యేది ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 1తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్టుగా ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఆర్య సిరీస్ అనంతరం దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమాతో ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ ప్రభావం పుష్ప సినిమాపై భారీగానే చూపిస్తుంది. తప్పకుండా ఈ సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పటికే విడుదలైన పుష్ప రాజ్ టీజర్ యూట్యూబ్ ప్రపంచంలో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ దాదాపు అన్ని భాషల ప్రేక్షకుల్లో కూడా అంచనాలను క్రియేట్ చేశాడు. తప్పకుండా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. అసలైతే మొదట ఈ సినిమాను కేవలం ఒక పార్ట్ లోనే పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ సినిమా కదా చాలా పెద్దగా ఉండడం తో పాటు ఒక భాగంలో చూపించేది కాదు అని చిత్రీకరణ తుది దశలో ఉన్న సమయంలో రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి మంచి హైప్ తో ముందుకు సాగుతున్న ఈ సినిమా పాటలు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక నవంబర్ లోనే సినిమా షూటింగ్ ఫినిష్ చేసే విధంగా దర్శకుడు సుకుమార్ ప్రణాళికలు రచిస్తున్నారు. డిసెంబర్లో సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

Pushpa movie latest news and icon project launch update ,

అయితే అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడు ఎలా మొదలు పెడతాడో అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. అసలైతే ఐకాన్ సినిమా కథ మొత్తం రాసుకున్న తర్వాతే వకీల్ సాబ్ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వేణు శ్రీరామ్ ఐకాన్ పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువవ్చి వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో అయితే ఒక హీరోయిన్ గా పూజా హెగ్డే సెలక్ట్ అయినట్లు టాక్ వస్తోంది. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా లెవెల్లోనే నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ ఐకాన్ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప రెండవ భాగం తో బిజీ కానున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి బన్నీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X