Pushpa 2: అల్లు అర్జున్ రికార్డుల ఊచకోత.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా పుష్ప 2
టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని మాత్రమే వచ్చిన అన్ని భాషల్లో హిట్ అయ్యాయి. వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' ఒకటి. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం దేశం మొత్తాన్ని ఊపేయడంతో పాటు వందల కోట్ల వసూళ్లతో సత్తా చాటింది.
'పుష్ప ది రైజ్' సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్లు చేస్తున్నారు.

దేశం మొత్తాన్ని ఊపు ఊపేసిన చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప ది రూల్'పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ వీడియోకు అదిరిపోయే స్పందన కూడా వచ్చింది. ఫలితంగా ఈ సినిమాపై అదిరిపోయే హైప్ కూడా పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'పుష్ప ది రూల్' మూవీ వివరాలను ప్రముఖ టికెటింగ్ వెబ్‌సైట్ బుక్ మై షో చాలా రోజుల క్రితమే అందులో పొందుపరిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఎంతో మంది ఆసక్తిని తెలుపుతున్నారు. ఇలా తాజాగా ఈ మూవీ బుక్‌మైషోలో 150K అంటే లక్షా యాభై వేల మంది ఆసక్తిని పొందింది.

'పుష్ప ది రూల్' తాజాగా బుక్ మై షోలో అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతుంది. అంటే ఏడు నెలల ముందే 150K ఇంట్రెస్టులను ఇది అందుకుంది. తద్వారా ఇండియాలోనే వేగంగా ఈ మార్కును చేరుకున్న సినిమా 'పుష్ప ది రూల్' రికార్డును నమోదు చేసింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రూపొందుతోన్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











