మాధవన్ నీ మీద నాకు క్రష్.. అభిమాని కోరికపై దిమ్మ తిరిగే జవాబు
విలక్షణ నటుడు మాధవన్ అంటే అమ్మాయిలకు పిచ్చి అభిమానం. సఖి, రెహనా హై తేరే దిల్ మే లాంటి చిత్రాల తర్వాత ఫిమేల్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అయితే తాజాగా ఓ అభిమాని ట్వీట్ చేసి తన ప్రేమను వ్యక్తం చేసింది. మాధవన్ నీవంటే 20 సంవత్సరాలుగా క్రష్ అంటూ ట్వీట్ చేసింది.
అందుకు సమాధానంగా ఏప్పా అంటూ ఓ కామెంట్ చేసి రెండు స్మైలింగ్ ఇమోజీలు, రెండు ఎరుపు రంగు హార్ట్స్ సింబల్స్ పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మాధవన్ కెరీర్ విషయానికి వస్తే.. రతన్ టాటా బయోపిక్‌లో నటిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించారు. అదే నిజమైతే ఎంతమందికో స్పూర్తినిచ్చే సినిమా అవుతుంది అని అన్నారు.
రతన్ టాటా బయోపిక్‌లో నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎవరో నా అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాంటి ప్రాజెక్టు గురించి సమాచారం నా వద్ద లేదు అంటూ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











