చిరంజీవి, రజినీకాంత్ ఒకేసారి ఆఫర్ ఇస్తే... లారెన్స్ ఎవరి సినిమా చేస్తాడో తెలుసా?
మొదట్లో సైడ్ డాన్సర్ గా కెరియర్ మొదట పెట్టిన లారెన్స్ ఆ తర్వాతి కాలంలో కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా మారి ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. గతంలోనే అనేక సినిమాలతో హిట్లు అందుకున్న ఆయన ఇప్పుడు చంద్రముఖి లాంటి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కి దగ్గరైన నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు లారెన్స్. ఈ నేపథ్యంలోనే ఆయన ఫిల్మీ బీట్ తెలుగు ఎడిటర్ రాజాబాబుకు ఎక్స్ క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
చంద్రముఖిగా కంగనా రనౌత్ నటించిన చిత్రం చంద్రముఖి 2. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అంటే పాన్ ఇండియా రేంజ్ లో ఈనెల 28వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫిల్మీ బీట్ తెలుగు ఎడిటర్ రాజా బాబుకు ఎక్స్ క్లూజివ్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

రాఘవ లారెన్స్ ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు ఫిల్మీ బీట్ తో పంచుకున్నారు. నిజానికి లారెన్స్ కి పూర్తిస్థాయిలో ప్రోత్సాహం ఇచ్చి ఆయన ఈ స్థాయికి వచ్చేలా చేసిన వారిలో చిరంజీవి పేరు, రజనీకాంత్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇద్దరితో సినిమా చేయాల్సి వస్తే ఎవరితో సినిమా చేస్తారు అని అడిగితే లారెన్స్ దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
తాను ఇద్దరికీ చాలా క్లోజ్ గా ఉంటాను కాబట్టి.. ఇద్దరినీ ఒప్పించి అడ్జస్ట్ చేసుకుని ఇద్దరితో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఇద్దరితో ఒకేసారి సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా సరే ఇద్దరూ తనకు దైవ సమానులు కాబట్టి తన మాట విని అడ్జస్ట్ అవుతారనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక గతంలో రాఘవ లారెన్స్ హీరోగా స్టైల్ అనే సినిమా తెరకెక్కి సూపర్ హిట్ అయింది.

ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక అతిధి పాత్రలో కనిపించి మెరిశారు. అయితే స్టైల్ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు చేయబోతున్నారు అలా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అని అడిగితే దానికి కూడా రాఘవ లారెన్స్ ఇంట్రెస్టింగా సమాధానం చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన తనకు ఉందని ప్రొడ్యూసర్ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాలలో గుర్తు చేశాడని చెప్పుకొచ్చారు.

అయితే డాన్స్ నేపథ్యంలో ఏదైనా మంచి కథ దొరికితే దానికి సీక్వెల్ గా చేయాలనే ఆలోచన కూడా తనకు ఉందని ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చాడు. ఇక 28వ తేదీన విడుదల కాబోతున్న చంద్రముఖి 2 సినిమాకి సంబంధించిన విశేషాలు కూడా ఆయన అనేకం పంచుకున్నారు. పూర్తి వీడియో యూట్యూబ్లో అందుబాటులో ఉంది చూసేయండి.


Click it and Unblock the Notifications











