కాంచన-3: 50 లక్షలతో లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి రూ. 10 లక్షలు.. డ్రామాలు చేస్తే నో సాయం!

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2‌తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్‌తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ లేటెస్ట్ మూవీ కాంచన-3 ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రాఘ‌వ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ మూవీని బి.మధు విడుదల చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాఘవ లారెన్స్ ఈ సినిమా కంటే తాను ఈ సినిమాతో హైదరాబాద్‌లో మొదలు పెట్టబోయే చారిటబుల్ ట్రస్ట్ గురించే ఎక్కువగా మాట్లాడారు.

రూ. 50 లక్షల విరాళం

రూ. 50 లక్షల విరాళం

హైదరాబాద్‌లో మొదలు పెట్టే ట్రస్టుకు నేను మొదట నా వంతుగా రూ.50 లక్షలు ఇస్తున్నాను. ఆడబ్బుతో ఇక్కడ ఉన్న వారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాలనేద నా ఆశ. ఇక్కడ ఉన్న ఎవరికైనా ఆ సమస్య ఉంటే నాకు కాల్ చేయండి, చదువుకోవడానికి కష్టంగా ఉన్న వారు కూడా నన్ను సంప్రదించవచ్చు. నా వల్ల అయిన సాయం చేస్తాను అని లారెన్స్ తెలిపారు.

చిరంజీవి అన్నయ్య రూ. 10 లక్షలు ఇచ్చారు

చిరంజీవి అన్నయ్య రూ. 10 లక్షలు ఇచ్చారు

చిరంజీవిగారికి ఫోన్ చేసి... కాంచన్-3 సినిమాతో ట్రస్ట్ మొదలు పెడుతున్నాను అన్నయ్యా, మీరు ఒకసారి వస్తే బావుంటుంది అన్నాను. లేదురా నేను షూటింగ్ కోసం కేరళ వెళుతున్నాను, రాలేను అని చెప్పారు. నీ కోసం ఒక వీడియో బైట్ పంపిస్తాను అన్నారు. ఆయన నన్ను ముందు నుంచీ ఎంకరేజ్ చేశారు. అంతే కాకుండా మొదట నేను రూ. 10 లక్షలు నీ ట్రస్టుకు ఇస్తాను అని చెప్పారు.

చిరంజీవిగారు నాకు మనిషి రూపంలో ఉన్న దేవుడు

చిరంజీవిగారు నాకు మనిషి రూపంలో ఉన్న దేవుడు

చిరంజీవిగారు నాకు ఎలా అంటే ఆయన నాకు మనిషి రూపంలో ఉన్న దేవుడు. ఆయన ఆశీర్వాదం ఉంటే తెలుగు రాష్ట్రాల్లో నా చారిటబుల్ ట్రస్ట్ పెద్ద రేంజికి తీసుకెళ్లగలను. ఈ ట్రస్టును నేను హెల్ప్‌గా చెప్పుకోవడం లేదు, మీరు డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల నా సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి ఇది తదతగ చేయాలి అని భావిస్తున్నాను.

సాయం కోసం డ్రామాలు ఆడుతున్నారు

సాయం కోసం డ్రామాలు ఆడుతున్నారు

చెన్నైలో ట్రస్ట్ మొదలు పెట్టినపుడు సాయం కోరడానికి కన్నీళ్లతో ఎవరు వచ్చినా ఇచ్చేవాడిని, కానీ దాంట్లో కూడా డ్రామాలు జరుగుతున్నాయని తెలుసుకున్నాను. నా ట్రస్టు ముందు వరకు నగలు వేసుకుని వస్తారు, లోనికి వచ్చేపుడు అవన్నీ తీసేసి ఏడుస్తూ నాటకాలు ఆడారు. అపుడే డిసైడ్ అయ్యాను.. హెల్ప్ చేస్తే కరెక్ట్ వ్యక్తలకు చేయాలని, చిరంజీవిగారు ఇచ్చిన 10 లక్షలు ఎవరు నిజంగా కష్టపడుతున్నారో వారి ఇంటికి వెళ్లి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.

మా అమ్మ లేకుంటే చనిపోయేవాడిని

మా అమ్మ లేకుంటే చనిపోయేవాడిని

చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవ చేయడం లాంటివి ఆలోచనకు కారణం మా అమ్మ. ఆమె లేకుంటే నేను లేను. చిన్నపుడు బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయేవాడిని, ఆవిడ వల్లే బ్రతికాను. అందుకే మా అమ్మకు గుడి కట్టించాను.

ఆ గర్వం ఇపుడులేదు

ఆ గర్వం ఇపుడులేదు

మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఎప్పుడూ నీ కోసం బ్రతికితే అది నార్మల్ లైఫ్. మిగతా వారి కోసం బ్రతికితే అది గొప్ప లైఫ్ అని.. మొదట్లో నాకు ఇవన్నీ మంచి పనులు చేస్తున్నాననే గర్వం ఉండేది. కానీ తర్వాత అర్థమైంది ఏమిటంటే ఇవన్నీ నేను చేయలేదు.. దేవుడు నాలో ఉండి చేయిస్తున్నాడు, నేను కేవలం పనివాడిని మాత్రమే. నాకు ఇల్లుతో పాటు అన్నీ ఉన్నాయి.. కానీ అవి కొనేపుడు ఉండే సంతోషం కంటే ఎవరికైనా సాయం చేసేపుడు వచ్చే సంతోషం ఎక్కువగా ఉంటుంది.. అని రాఘవ లారెన్స్ చెప్పుకొచక్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X