twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ హీరోకు షాకిచ్చిన ప్రముఖ హోటల్.. రెండు అరటిపళ్లకు బిల్లు కట్టారో తెలిస్తే షాకే!

    |

    హోటళ్లలో, రెస్టారెంట్లలో, లేదా ఎయిర్‌పోర్టులో సినీ ప్రముఖులకు చేదు అనుభవాలు ఎదురవ్వడం సాధారణంగా మారింది. తమకు జరిగిన మోసాల గురించి పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు రాహుల్ బోస్ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకొన్నారు.

    వ్యక్తిగత పనిమీద చండీగఢ్‌కు వెళ్లిన రాహుల్ బోస్ ఓ హోటల్‌ దిగారు. ఆ హోటల్‌లో వర్కవుట్లు చేస్తూ రెండు అరటిపళ్ల కోసం సిబ్బందికి ఆర్డర్ ఇచ్చాడు. వెంటనే రెండు అరటి పళ్లతోపాటు బిల్లును కూడా చేతిలో పెట్టారు. రెండు అరటి పళ్ల కోసం హోటల్ యాజమాన్యం ఇచ్చిన బిల్లు చూసి రాహుల్ తలతిరిగినంత పనైందట. రెండు అరటి పళ్ల ఆర్డర్‌ చేస్తే జీఎస్టీ, ఇతర పన్నులతోపాటు అక్షరాల రూ.442.50 బిల్లును ఇచ్చారట. ఈ బిల్లును ఫ్రూట్ ప్లాటర్ అని పేర్కొని బిల్లును రూపొందించారట.

    Rahul Bose paid for Rs.442.50 two Bananas

    మొదట బిల్లును చూసి నమ్మలేకపోయాను. తప్పు జరిగి ఎక్కువగా చార్జీ చేశారేమోనని హోటల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాను. జేడబ్ల్యూ మారియట్ చండీగఢ్ హోటల్ నిర్వాకాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాను అని రాహుల్ బోస్ ఓ వీడియోను పోస్టు చేశారు. అంతేకాకుండా వారిపై మాటలతో సెటైర్లు వేశారు.

    ఇటీవల కాలంలో రాహుల్ బోస్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, చమేలీ, దిల్ దడ్కన్ దో, పూర్ణ, ది జపనీస్ వైఫ్ చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. కమల్ హాసన్ రూపొందిన విశ్వరూపం 2 సినిమాలోనూ నటించి మెప్పించారు.

    English summary
    DNA reports that, Rahul Bose recently experienced an absolutely bizzare incident. The actor was spending time at a plush hotel in Chandigarh when he was handed a bill of Rs 442.50. Rahul had ordered only two bananas while working out in the hotel's gym.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X