‘మిఠాయి’ చేదు ఫలితం.. రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం!
కమెడియన్లు హీరోగా అవతారం ఎత్తి చేసిన సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. గతంలో ఎందరో కమెడియన్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. తాజాగా అర్జున్ రెడ్డి ఫేం రాహుల్ రామకృష్ణకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా 'మిఠాయి'. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు.

‘మిఠాయి' చూసి షాకైన ప్రేక్షకులు
ఇప్పటి వరుకు ఆయా సినిమాల్లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీ ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం, ‘మిఠాయి' అంటూ ఎట్రాక్టివ్, డిఫరెంట్ టైటిల్ చూసి సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్లారు. అయితే సినిమా చూసిన చాలా మంది చెత్త సినిమా చూసిన ఫీలింగుతో బయటకు వచ్చారు.

ఇంటర్వెల్ వరకు కూడా చూలేనంత చెత్తగా...
సినిమాకు వచ్చిన కొంత మంది ‘హిఠాయి'ని ఇంటర్వెల్ వరకు కూడా భరించలేక వెళ్లిపోవడం గమనార్హం. మరో వైపు ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి సైతం పూర్ రేటింగ్ రావడం, సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం కూడా బాక్సాఫీసు రేసులో బోల్తాపడింది.

ఇలాంటి సినిమా చేసినందుకు రాహుల్ రామకృష్ణ విచారం
‘మిఠాయి' లాంటి సినిమా చేసినందుకు విచారం వ్యక్తం చేస్తూ, అభిమానులకు క్షమాపణలు చెబుతూ రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్లు చేశారు. సినిమాను రిపేరు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం కానీ అవి ఫలించలేదని చెప్పుకొచ్చారు. కామెడీ చేయడం అంటే సులువైన జాబ్ కాదని, తిరిగి ప్రేక్షకుల ఆదరణ చూరగొంటానని పేర్కొన్నారు.

ట్విట్టర్ నుంచి వైదొలగిన రాహుల్ రామకృష్ణ
‘మిఠాయి' సినిమా గురించి ట్విట్టర్లో వస్తున్న కామెంట్లను భరించలేక, అభిమానులకు సమాధానం చెప్పుకోలేక చివరకు రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ నుంచి వైదొలగడం గమనార్హం. తన అకౌంట్ తాత్కాలికంగా డి యాక్టివ్ వేట్ చేశారా? లేక శాశ్వతంగా డిలీట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











