నాగార్జున నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనే!
కింగ్ నాగార్జున దేవదాస్ చిత్రం తరువాత మరో చిత్రానికి సైన్ చేయలేదు. చిలసౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆ మధ్యన నాగార్జునకు ఓ స్టోరీలైన్ వినిపించాడని ప్రచారం జరిగింది. వీళిద్దరి కాంబినేషన్ లో చిత్రానికి రంగం సిద్ధం అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రాహుల్ పూర్తి కథ సిద్ధం చేసి నాగార్జునకు వినిపించారట. కథ నచ్చడంతో నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇది మన్మథుడు చిత్రానికి సీక్వెల్ అని మన్మథుడు 2 అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శత్వంలో కూడా నాగార్జున నటించాల్సి ఉంది. ఇది కూడా సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్. బంగార్రాజు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

ముందుగా రాహుల్ రవీంద్రన్ చిత్రాన్ని పూర్తి చేసి బంగార్రాజు చిత్రాన్ని ప్రారంభించనున్నారు. మన్మథుడు చిత్రం 2002 లో విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. ఇక సోగ్గాడే చిన్నినాయనా 2016 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











