కచ్చితంగా అదిరిపోతుంది.. రాజ్ తరుణ్ భరోసా
రాజ్ తరుణ్.. తెలుగు చిత్ర సీమలో ఉవ్వెత్తున ఎగిసిన యువ కెరటం. అయితే ఆ కెరటం కింద పడటానికి ఎంతో కాలం పట్టలేదు. అలా కిందపడిన కెరటం.. పైకి లేవడానికి చాలా కష్టపడుతోంది. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21 ఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఓ ఊపు ఊపేశాడు. అంత వరకు బాగానే ఉంది. వచ్చిన విజయాలను, స్టార్ డమ్‌ను కాపాడుకోలేక పోయాడు రాజ్ తరుణ్. కెరీర్ స్టార్టింగ్‌లోనే బ్లాక్ బస్టర్స్ రావడంతో సక్సెస్‌ను ఈజీగా పొందాడు. అటుపై ఇప్పటి వరకు మరో సాధారణ సినిమాను కూడా ప్రేక్షకులకు అందించలేకపోయాడు.
వరుస డిజాస్టర్లతో అటు నిర్మాతలను, ఇటు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నాయి. దిల్ రాజు ఎంతో జాగ్రత్త వహించి రాజ్ తరుణ్ చిత్రాలను తెరకెక్కించినా ఫ్లాపులే ఎదురవుతున్నాయి. చివరగా వచ్చిన ఇద్దరి లోకం ఒకటే చిత్రం సైతం అందర్నీ నిరాశ పరిచింది. ఎన్నో అంచనాల నడుమ, కూల్ లవ్ స్టోరీగా టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకోగా.. పూర్తి స్థాయి చిత్రంగా మెప్పించలేకపోయింది.

ఇక సినిమాల ద్వారానే కాకుండా ఆ మధ్య మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తూ హల్చల్ చేశాడు. అలా చాల రోజుల తరువాత రాజ్ తరుణ్ పేరు వార్తల్లో మార్మోగిపోయింది. అయితే రాజ్ తరుణ్ తన తదుపరి చిత్రంపై ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. అంతేకాకుండా ఆ చిత్రం కచ్చితంగా అందర్నీ మెప్పింస్తుందనే సంకేతాలు ఇచ్చాడు.
'ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతందా? అని నేను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను..ఇదో అద్భుతమైన చిత్రమవుతుందని కచ్చితంగా చెప్పగలను.. మిగతా వివరాలను త్వరలోనే చెబుతాన'ని ప్రకటించాడు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న మొదటి ప్రాజెక్ట్ కాగా.. రాజ్ తరుణ్‌కు ఇది పద్నాలుగో చిత్రం. ఈ సినిమాను సంతోష్ మోహన్ వీరంకి తెరకెక్కిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











