హిట్టుకోసం రాజ్ తరుణ్ ఆరాటం.. ఆశలన్నీ బుజ్జిగాడిపైనే!
కెరీర్ మొదట్లో ఒక సినిమా సక్సెస్ అయితే ఆ హీరోలకు భారీ ఆఫర్స్ రావడం సహజమే. ఇక వరుసగా మూడు నాలుగు హిట్స్ కొడితే ఇక వారికి ఇండస్ట్రీలో ఒక మార్కెట్ సెట్టయినట్లే అని చెప్పవచ్చు. కానీ రాజ్ తరుణ్ దురదృష్టం ఏమిటో గాని ఈ మధ్య వరుసగా అపజయాలు ఎదురవుతున్నాయి. అలాగే చేసిన సినిమాలు కూడా థియేటర్స్ వరకు రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
లాక్ డౌన్ కారణంగా రాజ్ తరుణ్ ఒరేజ్ బుజ్జిగా సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రిలీజైనా కూడా సినిమా చూడటానికి జనాలు థియేటర్స్ వరకు వస్తారో లేదో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

అయితే ఒరేయ్ బుజ్జిగా సినిమాపై రాజ్ తరుణ్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. తప్పకుండా ఆ సినిమా సక్సెస్ అవుతుందని ఆశలు పెట్టుకున్నాడు. అందుకే సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారనే రూమర్స్ వస్తే.. వెంటనే వాటిపై స్పంధించి సినిమా తప్పకుండా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని చెప్పాడు. ఏదేమైనా ఈ సినిమాతోనే బౌన్స్ బ్యాక్ అవ్వాలని రాజ్ తరుణ్ కోరుకుంటున్నాడు. మరి ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











