పాపం రాజ్ తరుణ్.. బుజ్జిగాడు కూడా అవుట్, ఆదాయం సున్నా?
కరోనా వైరస్ దెబ్బకు సినిమా వాళ్ళు సహాయ నిధులు ప్రకటిస్తున్నారు. పేద కార్మికులకు అండగా ఉండేందుకు తోచినంత విరాళాలు అందిస్తూ వారి మానవతా హృదయాన్ని చాటుకుంటున్నారు. అయితే కరోనా కారణంగా సినిమాలు ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో చేసేదేమీ లేక వచ్చిందే లాభం అనుకోని నిర్మాతలు OTT ఫ్లాట్ ఫార్మ్ లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
ఆ డీలింగ్స్ ఎలా నడుస్తున్నాయి అనేది పక్కనపెడితే ఇప్పుడు ఒక యువ హీరో కెరీర్ పెద్ద సందిగ్ధంలో పడింది. అతనెవరో కాదు కెరీర్ మొదట్లో వరుసగా బిగ్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల - సినిమా చూపిస్త మావ - కుమారి 21F సినిమాలతో సాలిడ్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ ఆ తరువాత వరుస అపజయలతో డీలా పడ్డాడు. దీంతో నెక్స్ట్ సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలని ఎంతో కష్టపడి 'ఒరేయ్ బుజ్జిగా' అనే సినిమా చేశాడు.

ఈ సినిమాకు రాజ్ తరుణ్ రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. సినిమా రిజల్ట్ ని బట్టి తప్పకుండా మంచి ఎమౌంట్ ఇస్తామని నిర్మాతలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజ్ కాలేని పరిస్థితి. దీంతో రాజ్ తరుణ్ ఆదాయం ఈ ఏడాది సున్నా అని ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది. విజయ్ కుమార్ కొండ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అవుట్ ఫుట్ బాగానే వచ్చినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల ఎంతో కొంత డబ్బు అందుతుందని నిర్మాత OTT సైడ్ బేరం పేట్టినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











