1 కాంట్రవర్సీ.. 2 నెలలు.. 3 సినిమాల స్పీడ్‌తో దూసుకెళ్తున్న జోవియల్ స్టార్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ లో ఇటీవల ఓ రేంజ్ లో కాంట్రవర్సియల్ గా మారిన యువ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మన జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అనే చెప్పాలి. ఎప్పుడు లేనిది తన పర్శనల్ లైఫ్ బయట ప్రపంచానికి ఎక్స్ పోజ్ కావడంతో రాజ్ తరుణ్ ఇప్పుడు చాలా హార్డ్ టైం ని ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. కాగా ఇదే సమయంలో తాను గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాలు చేస్తున్నాడు అని చెప్పాలి.
టాలీవుడ్ లో పెద్దగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చిన ఈ యువ హీరో కెరీర్ మొదట్లోనే మంచి సినిమాలు చేసి హిట్స్ కొట్టాడు. కానీ తనకి స్టార్టింగ్ లో ఎంత క్రేజ్ అండ్ హిట్స్ వచ్చాయో అంతే వేగంగా కెరీర్ లో ప్లాప్ లు కూడా వచ్చాయి. ఇలా ఒక సమయంలో అసలు సినిమాలు లేవు అని అనుకుంటున్న సమయంలో అరకొర సినిమాలతో రెండేళ్లకోసారి రిలీజ్ లతో వచ్చాడు. దీంతో రాజ్ తరుణ్ కి పెద్దగా ఆఫర్స్ లేవు అనే చాలా మంది అనుకున్నారు.

కానీ ఇపుడు సడెన్ గా తాను సింగిల్ కాంట్రవర్సీతో టాలీవుడ్ లో మరోసారి హైలైట్ అయ్యాడు. ఇలా హైలైట్ అయ్యిన కొన్ని వారాల్లోనే రాజ్ తరుణ్ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసి షాకిచ్చాడు. ఇపుడు ఈ రెండు తర్వాత ఏకంగా మూడో సినిమా రిలీజ్ కి తెస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసాడు. దీనితో అసలు ఈ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ చేసాడు? ఎప్పుడు కంప్లీట్ చేసేసాడో కూడా చాలా మందికి అర్ధం కాలేదు.
మరి గత జూలై 29న "పురుషోత్తముడు" అంటూ ఒక సోషల్ మెసేజ్ సినిమాతో తాను రాగా ఆ నెక్స్ట్ వీక్ లోనే ఆగస్ట్ 2న "తిరగబడరా సామి" అంటూ ఒక మాస్ అండ్ లవ్ స్టోరీతో పలకరించాడు. ఇక ఈ సినిమా వచ్చిన మరో నెలకి ఇంకో కొత్త సినిమాని థియేటర్స్ లో దింపుతున్నట్టుగా అనౌన్స్ చేసేసాడు. ఇది కూడా దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో రావడం విశేషం.
"భలే ఉన్నాడే" అంటూ అనౌన్స్ అయ్యిన ఈ చిత్రాన్ని మారుతీ నిర్మాణం వహించగా ఈ సినిమా ఈ సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి వస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. దీనితో ఒక కాంట్రవర్సీతో హైలైట్ అయ్యిన రాజ్ తరుణ్ రెండు నెలలు పూర్తి కాకుండానే ఏకంగా మూడు సినిమాలతో వస్తుండడం మామూలు స్పీడ్ కాదని చెప్పాలి.

మరి తన చుట్టూ అంత రచ్చ నడుస్తునా ఈ సమయంలోనే తన నుంచి ఇన్ని సినిమాలు రావడం అనేది ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి. కాగా సినిమాల కోసం ఇలా ఉంటే మరోపక్క తన మాజీ లవర్ లావణ్యతో న్యాయ పోరాటం రాజ్ తరుణ్ చేస్తున్నాడు. అలాగే తన లాస్ట్ సినిమా తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా తోనే ఇప్పుడు తాను ప్రేమలో ఉన్నాడని మాజీ ప్రేయసి ఆరోపిస్తుంది.


Click it and Unblock the Notifications











