విజయవాడ అమ్మాయితో హీరో రాజ్ తరుణ్ వివాహం, ఆరేళ్లుగా ప్రేమలో...

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా లైవ్ చాటింగ్ చేసిన సమయంలో కూడా అభిమానులు ఇందుకు సంబంధించి ప్రశ్నలు అడగ్గా... ప్రేమలో ఉన్నమాట నిజమే, అమ్మాయి ఎవరో త్వరలోనే వెల్లడిస్తాను అంటూ వారిని మరింత సస్పెన్స్‌లోకి నెట్టేశాడు.

తాజాగా ఓఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ తన ప్రేమ, పెళ్లి వ్యవహారాలకు సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడించారు. ఆమె ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి? పెళ్లి ఎప్పుడనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం

ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం

ఆరేళ్ల క్రితం వైజాగ్‌లో రాజ్ తరుణ్ పుట్టినరోజు వేడుక జరిగిన సమయంలో ఆ అమ్మాయి పరిచయం అయిందట. ఇద్దరి ఇష్టాలు, అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డామని, ఈ క్రమంలో తమ మధ్య సాన్నిహిత్యం, ఇష్టం మరింత పెరిగిందని రాజ్ తరుణ్ తెలిపారు.

విజయవాడకు చెందిన అమ్మాయి

విజయవాడకు చెందిన అమ్మాయి

తాను ప్రేమిస్తున్న అమ్మాయి పేరు చెప్పడానికి రాజ్ తరుణ్ ఇష్టపడలేదు. అయితే ఆమె విజయవాడకు చెందిన అమ్మాయి అని, సినిమా పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి అని తెలిపారు. విజయవాడలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నట్లు వెల్లడించారు.

ఆమె ప్రైవసీకి భంగం కలగకూడదనే...

ఆమె ప్రైవసీకి భంగం కలగకూడదనే...

ఆమె సింపుల్‌గా ఉండే తెలుగు ఇంటి అమ్మాయి. ప్రైవసీకి భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే పేరు బయట పెట్టడం లేదు. ఆమె కోరిక మేరకు కొంతకాలం వరకు ఈ విషయం రహస్యంగా ఉంచక తప్పడం లేదు. త్వరలోనే అన్ని విషయాలు బయట పెట్టే సమయం వస్తుందని రాజ్ తరున్ తెలిపారు.

వచ్చే ఏడాది పెళ్లి

వచ్చే ఏడాది పెళ్లి

వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు రాజ్ తరుణ్ తెలిపారు. మా ఇంట్లో వారికి కూడా ఆమె చాలా దగ్గరైంది, ఇరు కుటుంబాల నుంచి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. వచ్చే ఏడాది తమ వివాహం ఎప్పుడు జరుగుతుందనే విషయం త్వరలో వెల్లడిస్తామన్నారు.

నేను మోసం చేయను అనే నమ్మకం ఉంది

నేను మోసం చేయను అనే నమ్మకం ఉంది

నేను సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేసినా, ముద్దు సీన్లు చేసినా అదంతా నటన మాత్రమే. నా వృత్తిలో భాగమే. ఈ విషయాలను ఆమె అర్థం చేసుకోగలదు. నేను మోసం చేయను అనే నమ్మకం తనకు ఉందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X