RRR కోసం రంగంలోకి అమీర్ ఖాన్.. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు

దర్శకధీరుడు రాజమౌళి కరోనా వల్ల కాస్త స్లో అయ్యారు గాని లేకుంటే ఈపాటికే RRR ప్రమోషన్స్ ఒక రేంజ్ లో ఉండేవి. కోలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా జక్కన్న చేసే ప్రమోషన్స్ ప్లాన్స్ గురించి బహుబలితోనే చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. ఇక అంతకంటే హై రేంజ్ లో తెరకెక్కిస్తున్న RRR ప్రమోషన్స్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ ను కూడా రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అటువైపు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు

అటువైపు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRRను దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ మార్కెట్ ఎక్కువ కాబట్టి జక్కన్న అటువైపు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం అజయ్ దేవ్ గన్ ని కూడా తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు 70% అయితే పూర్తయ్యింది.

 త్వరలోనే మరొక కీలక షెడ్యూల్

త్వరలోనే మరొక కీలక షెడ్యూల్

ఇక ఇటీవల ఒక షెడ్యూల్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ త్వరలోనే మరొక కీలక షెడ్యూల్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా షూటింగ్ లో జాయినా కానున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో జక్కన్న ఇటీవల బ్రేక్ లో తన తండ్రి విజయేంద్రప్రసాద్ తో చర్చించినట్లు టాక్ వస్తోంది.

RRR వాయిస్ ఓవర్ కోసం

RRR వాయిస్ ఓవర్ కోసం

కె.విజయేంద్రప్రసాద్ సినిమాకు కథ అందించిన విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే.. అమీర్ ఖాన్ ను కూడా RRR కోసం వాడుకోబోతున్నట్లు టాక్ అయితే వస్తోంది. హిందీ వెర్షన్ లో పాత్రలను పరిచయం చేసే బాధ్యతను అమీర్ ఖాన్ కి ఇవ్వనున్నారట. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను హిందీ ఆడియేన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా పవర్ఫుల్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని సమాచారం.

Recommended Video

Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
 అమీర్ ఖాన్ ఒప్పుకున్నట్లే

అమీర్ ఖాన్ ఒప్పుకున్నట్లే

ఇక అమీర్ ఖాన్ కు రాజమౌళి అంటే చాలా ఇష్టం. చాలా ఇంటర్వ్యూలో తప్పకుండా అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఉంటుందని చెప్పారు. ఇక రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా అమీర్ ఖాన్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. అయితే జక్కన్న ఫ్యామిలీతో ఒక స్పెషల్ బాండింగ్ ఉండడం వలన అమీర్ ఖాన్ తప్పకుండా వాయిస్ ఓవర్ ఇస్తాడాని చెప్పవచ్చు. మరి కోలీవుడ్, టాలీవుడ్ లలో వాయిస్ ఓవర్ ఎవరెవరు అందిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X