షాకింగ్: ఎన్టీఆర్ సంచలన నిర్ణయం.. ఆయన చెప్పాడని ఏ హీరో చేయని సాహసం చేస్తున్నాడు.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. నందమూరి తారక రామారావు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ.. డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, యాక్టింగ్‌లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న తారక్.. ఆ తర్వాత కొన్ని పరాజయాలను చవి చూశాడు. అయితే, కొన్నేళ్ల నుంచి అతడు విజయవంతమైన చిత్రాలను అందిస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా తారక్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం.? వివరాల్లోకి వెళితే...

అక్కడి నుంచి దూసుకుపోతున్నాడు

అక్కడి నుంచి దూసుకుపోతున్నాడు

ఆ మధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్' తర్వాత అతడు మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడడం లేదు. వరుసగా ఐదు విజయాలను అందుకుని రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. అదే సమయంలో మార్కెట్‌ను కూడా పెంచుకుంటున్నాడు.

ఇప్పుడు మెగా హీరోతో కలిసి చేస్తున్నాడు

ఇప్పుడు మెగా హీరోతో కలిసి చేస్తున్నాడు

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. వీళ్ల సరసన ఒలీవియా మోరిస్, ఆలియా భట్ ఆడి పాడనున్నారు. వీళ్లతో పాటు చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఒక్కటి కాదు.. ఎన్నో ప్రయోగాలు

ఒక్కటి కాదు.. ఎన్నో ప్రయోగాలు

ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందుకోసమే అందరూ ఎంతో కసిగా పని చేస్తున్నారు. ఇక, తారక్ విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం అతడు ఎంతగానో శ్రమిస్తున్నాడు. మంచి ఫిజిక్ కోసం కొద్ది రోజుల నుంచి జిమ్‌లో చమటోడ్చుతూనే ఉన్నాడు. అలాగే, లుక్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

తన స్టామినా దేశం మొత్తం తెలియాలని

తన స్టామినా దేశం మొత్తం తెలియాలని

జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయంలో అతడితో మరే స్టార్ హీరో పోటీ పడలేరన్న టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో RRR కోసం తారక్.. అన్ని భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడికి దక్షిణాది భాషలతో పాటు హిందీ పైనా పట్టు ఉండడంతోనే రాజమౌళి కూడా ఓకే చెప్పాడని టాక్.

ఆయన చెప్పాడని ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

ఆయన చెప్పాడని ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా కోసం తారక్ గుండుతో కనిపించబోతున్నాడట. క్లైమాక్స్‌లో వచ్చే పదిహేను నిమిషాల ఫైట్ కోసం ఈ స్టార్ హీరో.. తన జుట్టును తీసేయడానికి సిద్ధం అయ్యాడని అంటున్నారు. రాజమౌళి సూచన మేరకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.?

తారక్ గుండుతో కనిపించబోతున్నాడన్న వార్త వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి. అతడు జుట్టు లేకుండా కనిపిస్తే.. నందమూరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఒకవేళ తారక్ నిజంగానే ఇలా కనిపిస్తే.. అతడిపై ప్రశంసల వర్షం కురిసే అవకాశం కూడా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X