‘రంగస్థలం’లో విలన్ పాత్ర రిజెక్ట్ చేయడంపై... స్పందించిన రాజశేఖర్!
Recommended Video
టాలీవుడ్ స్టార్ రాజశేఖర్ విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమే అని పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అలా అనడమే తప్ప ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ విలన్ పాత్ర చేయలేదు. చిరంజీవి సినిమాలో నెగెటివ్ రోల్ చేయడానికి ఆయన ఒప్పుకున్నారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. అయితే అవేవీ వాస్తవరూపం దాల్చలేదు.
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'రంగస్థలం'లో సైతం మెయిన్ విలన్ పాత్ర కోసం ఆయన్ను సంప్రదించారని, అయితే ఆయన ఈ ఆఫర్ రిజక్ట్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా 'కల్కి' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్ దీనిపై స్పందించారు.

అలా మెప్పించగల కెపాసిటీ నాలో ఉంది
హీరో పాత్రలు మాత్రమే కాదు...విలన్ పాత్రలు కూడా చేయడానికి సిద్ధమే అని ఎప్పటి నుంచో చెబుతున్నాను. ఎందుకంటే నాపై నాకు నమ్మకం ఉంది. ఒక విలన్ క్యారెక్టర్ చేసి.. మళ్లీ హీరో క్యారెక్టర్ చేసి మెుప్పించగ కెపాసిటీ నాలో ఉంది. ఏలాంటి పాత్ర అయినా చేస్తాను.... అని రాజశేఖర్ తెలిపారు.

ఇప్పటి వరకు వచ్చినవన్నీ రోటీన్ సబ్జెక్టులే
అయితే అలాంటి పాత్రలు చేయాలంటే సినిమా కథ కొత్తగా ఉండటంతో పాటు పాత్ర కూడా కొత్తగా ఉండాలి. అందులో నా పాత్ర అందరూ మెచ్చుకునేలా ఉండాలి. ఇప్పటి వరకు నన్ను విలన్ పాత్రకు అడిగిన వారంతా రొటీన్ సబ్జెక్టుతోనే వచ్చారు. అందుకే ఒప్పుకోలేదు. విలన్ పాత్ర అయినా, గెస్ట్ అప్పియరెన్స్ అయినా కొత్తగా ఉండాలనేది నా ఆలోచన... అని రాజశేఖర్ స్పష్టం చేశారు.

‘రంగస్థలం'లో విలన్ పాత్ర చేయక పోవడంపై
రంగస్థలం సినిమాలో నాకు విలన్ పాత్ర చేసే అవకాశం వచ్చింది అనే వార్తలో నిజం లేదు. ఆ పాత్ర కోసం ఎవరూ నన్ను సంప్రదించలేదు. అది చాలా మంచి క్యారెక్టరే.. వచ్చి ఉంటే చేసుండేవాడినేమో? సినిమా రిలీజైన తర్వాత ఇలాంటి వార్తలు వింటున్నాను కానీ నా వరకు రాలేదు. జగపతి బాబు చాలా బాగా చేశారు. అది నాకు చాలా నచ్చిన పాత్ర అన్నారు.

జనసేన ఓటమిపై
జనసేన ఓడిపోయిన తర్వాత మనం మాట్లాడటం సరికాదు, ఎక్కడ మిస్టేక్స్ జరిగింది అని వారికి తెలిసే ఉంటుంది. వారు దాన్ని సరిదిద్దుకుంటారు. జగన్ గారు పది సంవత్సరలు ఓపికగా జనాల మధ్యలో ఉండి వారి మద్దతో అధికారంలోకి వచ్చారు. ఎంతో కష్టపడితేనే అది సాధ్యమైందని... రాజశేఖర్ అభిప్రాయ పడ్డారు.

కల్కి
‘కల్కి' చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మంచి హైప్ రావడానికి కారణం అయ్యాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 28న విడుదల అవుతుండగా... అమెరికాలో ఒక్క రోజు ముందు 27న ప్రీమియర్ షోలు వేస్తున్నారు.కల్కి సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది.


Click it and Unblock the Notifications











