మహేష్ బాబు సినిమా వదిలేసిన రాజశేఖర్.. ఆ మూవీ చేసింటే రేంజ్ వేరేలా ఉండేది!

టాలీవుడ్‌లో ఒకప్పుడు 'యాంగ్రీ యంగ్ మేన్'గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ (Rajashekhar). హీరోగా అలరించిన ఆయన, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో'బైకర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించగా, రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో ఆయన కనిపించబోతుండటం ఆసక్తిని పెంచుతోంది. రేసింగ్ నేపథ్యంతో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతుంది. అయితే.. ఆయన కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

హీరో రాజశేఖర్ బైకర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక క్లాసిక్ మూవీని ఆయన మిస్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల జాబితాలో ప్రత్యేక స్థానం దక్కించుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలోని కీలక పాత్రను తాను మిస్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

Rajasekhar Opens Up on Missing Mahesh Babu Seethamma Vakitlo Sirimalle Chettu Role Internet Reacts

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన 'రేలంగి మామయ్య' పాత్ర ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో తెలిసిందే. ఎప్పుడూ నవ్వుతూ, కుటుంబాన్ని కలిపి ఉంచే ఆ పాత్ర సినిమాకు హార్ట్‌లాంటి పాత్రగా నిలిచింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ పాత్ర కోసం మొదటగా రాజశేఖర్‌ను సంప్రదించారట. ఆయన నవ్వు, వ్యక్తిత్వం ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాయని భావించిన మేకర్స్ ముందుగా ఆయనకే ఆఫర్ ఇచ్చినట్లు రాజశేఖర్ తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను చేయలేకపోయానని ఆయన వెల్లడించారు. అయితే ఆ అవకాశం తర్వాత ప్రకాష్ రాజ్‌కు వెళ్లి, ఆయన ఆ పాత్రను జీవించి చూపించారు.

ప్రకాశ్ రాజ్ నటనతో 'రేలంగి మామయ్య' పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. సినిమా విడుదలైన తర్వాత కూడా ఆ పాత్ర పేరు జనాల్లో నానాటికీ వినిపిస్తూనే ఉంది. ఎవరైనా ఎప్పుడూ నవ్వుతూ ఉంటే సరదాగా 'రేలంగి మామయ్య' అని పిలిచేంతగా ఆ క్యారెక్టర్ ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు రాజశేఖర్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో, 'ఆ సినిమా చేసి ఉంటే ఆయన కెరీర్ మరో లెవెల్‌లో ఉండేదేమో' అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో 'ఆ పాత్రకు ప్రకాష్ రాజ్ మాత్రమే పర్ఫెక్ట్' అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

రాజశేఖర్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఒకప్పుడు వరుస హిట్స్‌తో టాప్ హీరోగా ఉన్న ఆయన, గత కొన్నేళ్లుగా సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు. 'గరుడవేగ' తర్వాత ఆయనకు సరైన సక్సెస్ రాలేదు.అయితే.. సినీ ఇండస్ట్రీలో మంచి పాత్రలు మిస్ అవ్వడం, తర్వాత అది బ్లాక్‌బస్టర్ అవ్వడం చాలా సాధారణమే. కానీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రను వదులుకోవడం రాజశేఖర్ కెరీర్‌పై ప్రభావం చూపిందా? అనే ప్రశ్న ఇప్పుడు మళ్లీ ముందుకొస్తోంది. అయితే ఈ విషయంపై రాజశేఖర్ మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పడం గమనార్హం. 'అలా జరగాల్సిందే జరిగింది' అనే భావనతో ఆయన ముందుకు సాగుతున్నారు.

ప్రస్తుతం రాజశేఖర్ క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లడం ఆయన కెరీర్‌కు కొత్త దిశ ఇవ్వొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మంచి పాత్రలు వస్తే తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇక 'బైకర్' సినిమా విజయంపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం సక్సెస్ అయితే, రాజశేఖర్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గతాన్ని పక్కన పెట్టి, కొత్త పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాజశేఖర్ ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X