మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్
సీనియర్ హీరోల్లో ప్రస్తుతం కొందరు లీడ్ రోల్స్ చేయకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఒక వేలుగు వెలిగిన స్టార్స్ కూడా ప్రస్తుతం హీరోలుగా చేయలేమని అర్థం చేసుకొని విలన్స్ గా కూడా ట్రై చేస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ వంటి స్టార్స్ ఏ విధంగా ఆకట్టుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఇక గత కొన్నేళ్లుగా సరైన బాక్సాఫీస్ హిట్స్ లేక రాజశేఖర్ కూడా అలాంటి పాత్రలే చేయడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ వచ్చింది. కానీ ఆయన మాత్రం రూమర్స్ కు కౌంటర్ ఇచ్చేలా ఇంకా కథానాయకుడిగా నటిస్తున్నాను అని సినిమాలు ఓకే చేస్తున్నారు. అయితే ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఆయన బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోవడం లేదు.

ఆ మధ్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గరుడవేగ సినిమాతో పరవాలేదు అనిపించినప్పటికి మళ్ళీ తరువాత కల్కితో వచ్చి డిజాస్టర్ అందుకున్నారు. ఆ సినిమాతో మరికొంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ మళ్ళీ ఇప్పుడు వరుసగా కొత్త ప్రాజెక్టులను ఒకే చేస్తున్నారు.
నెక్స్ట్ వీరభద్రం చౌదరితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత భూమిక మిస్సమ్మ దర్శకుడు నీలకంఠ రెడ్డితో వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాజశేఖర్ తన కొత్త సినిమాలకు సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











