Don't Miss!
- News కేసీఆర్‌కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్‌బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నేను అంత చెడ్డవాన్ని కాదు, ఆ వార్తలు నమ్మొద్దు: హీరో రాజశేఖర్
డా.రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం కల్కి. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్లో రూపొందుతున్న మూవీ టీజర్ ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.
ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ... 'కల్కి' టీజర్ నా పుట్టినరోజు(ఫిబ్రవరి 4) సందర్భంగా విడుదల అవుతోంది. ఈ సినిమా గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడను. రిలీజైన తర్వాతే అన్ని విషయాలు మాట్లాడతాను. 'గరుడ వేగ' తర్వాత ఆరు నెలలు రకరకాల సబ్జెక్టులు వెతికీ చివరకు 'కల్కి' ఫైనల్ చేశామని తెలిపారు.
దర్శకుడి కోసం వెయిట్ చేశాం.. చివరకు కరుణించాడు
‘కల్కి' సబ్జెక్ట్ ఓకే అయిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ డేట్స్ కోసం వెయిట్ చేశాం. చివరకు ఆయన కరుణించి మాకు ఓకే చెప్పారు. చాలా రోజుల తర్వాత మళ్లీ సి.కళ్యాణ్ బేనర్లో యాక్ట్ చేస్తున్నాను. ‘గరుడ వేగ' తర్వాత ఆయన నాతో సినిమా చేయడానికి ముందుకు రావడం నాకు పెద్ద ప్రమోషన్ లాంటిదని రాజశేఖర్ అన్నారు.
ఆయన నుంచి చాలా నేర్చుకున్నా
‘గరుడ వేగ' చేసినపుడు ప్రవీణ్ సత్తారుతో ఎంత కొత్తగా, డిఫరెంటుగా ఫీలయ్యానో... ప్రశాంత్ వర్మ ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఆయన నాకు సీన్ వివరించే సమయంలో అద్భుతంగా యాక్ట్ చేసి చూపించేవారు. తనకు ఏది కావాలో క్లియర్ గా చెప్పగలరు. నా నుంచి ఆయనకు ఏది కావాలో దాన్ని రాబట్టుకున్నారు.
జీవిత టార్చర్ అనుభవించింది
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నాకు, ప్రశాంత్, సి కళ్యాణ్ మధ్య నమన్వయం చేస్తూ టార్చర్ ఫేస్ చేసింది జీవిత మాత్రమే. అలా టార్చర్ ఫేస్ చేస్తూ నన్ను నా పుట్టినరోజు ఇంత సంతోషంగా ఉంచారు. జీవితం అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది. ఉన్నన్ని రోజులు అందరితో సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని ఈ సందర్భంగా చెప్పాలనిపించిందని రాజశేఖర్ వ్యాఖ్యానించారు.
నేను అంత చెడ్డవాన్ని కాదు
బయట నాపై చాలా చెడ్డపేరు ఉంది. కానీ అది నిజం కాదు అని రాజశేఖర్ అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మను రాజశేఖర్ ఇబ్బంది పెట్టారనే వార్తల నేపథ్యంలో రాజశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజశేఖర్ ఫ్యామిలీ ఎలాంటిదేంటే...?
ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ... ఆ ప్రచారం నిజం కాదు. రాజశేఖర్ ఫ్యామిలీ చాలా స్వీట్ ఫ్యామిలీ. చాలా సపోర్ట్ చేశారు. శివానీ, శివాత్మిక గారితో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో నేను వెయిట్ పెరగకుండా ఉండటానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే వారు అంత మంచి ఫుడ్ పెట్టారు. 48 గంటలు కంటిన్యూస్ గా షూట్ చేసిన రోజుల కూడా ఉన్నాయి. రాత్రి 2, 3 గంటలకు కూడా తిండిపెట్టి చంపేశారు. అది తప్పితే వేరే కంప్లయింట్ ఏమీ లేవని తెలిపారు.