మోహన్ బాబు ఇంట్లో రజనీకాంత్.. ఫొటోలతో సర్ ప్రైజ్ ఇచ్చిన హీరో.. అసలు కారణమిదే!

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు అత్యంత ఇష్టమైన ప్రాణ స్నేహితుడు రజనీకాంత్ అని ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే. తలైవా కూడా మోహన్ బాబును ఎంతగానో ఇష్టపడతారు. గత 40ఏళ్లుగా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇక అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోలు వైరల్ అవ్వడంతో ఇంత సడన్ గా ఎలా కలుసుకున్నారు? ఎందుకు కలుసుకున్నారు అనే ఊహాగానాలు ఎన్నో వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి కలయిక

మొదటి కలయిక

మోహన్ బాబు - రజనీకాంత్ కేవలం సినిమాల వరకే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి చాలానే మాట్లాడుకుంటూ ఉంటారు. వీరి స్నేహం రీసెంట్ గా మొదలైంది కాదు. 1980 కాలం నుంచి కొనసాగుతోంది. మోహన్ బాబు - దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చిన తమిళ్ మూవీ 'నట్చతీరమ్' మూవీలో మోహన్ బాబు - రజనీకాంత్ మొదటిసారి కలిసి నటించారు.

ఆ సినిమాతో బిగెస్ట్ హిట్

ఆ సినిమాతో బిగెస్ట్ హిట్

ఆ తరువాత తమిళ్ లోనే కొన్ని సినిమాల్లో మోహన్ బాబు రజనీకాంత్ కోసం నటించారు. గెస్ట్ అప్పిరియన్స్ చాలానే ఉన్నాయి. ఇక తెలుగులో పెదరాయుడు సినిమా అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాను రజనీకాంత్ సజెస్ట్ చేసి మోహన్ బాబుతో చేయించాడు. తన ఇష్టంతోనే తలైవా అడగక ముందే గెస్ట్ రోల్ లో నటించాడు.

ఫొటోలు బయటకు రావడంతో

ఫొటోలు బయటకు రావడంతో

చాలా సమయాల్లో ప్రొడక్షన్ వర్క్ కోసమని రజనీకాంత్ మోహన్ బాబుకు ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. ఇక ఈ ఇద్దరు కాలం పరిగెడుతున్న కొద్దీ మరింత దగ్గరవుతూ వస్తున్నారు. ఇక రీసెంట్ గా వీరికి సంబంధించిన HD ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

అసలు కారణం ఏమిటంటే

అసలు కారణం ఏమిటంటే

ఈ ఫొటో షూట్ వెనుక అసలు కారణం ఏమిటంటే.. ఇటీవల రజనీకాంత్, శివ దర్శకత్వంలో అన్నత్తే అనే సినిమాను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ ముగియడంతో డైరెక్ట్ గా మోహన్ బాబు ఇంటికి వచ్చేశాడు.

Recommended Video

#SSMBRampageOnMAY31st : Mahesh Babu ఫ్యాన్స్ కి పండగే..!! || Filmibeat Telugu
అసలైన గ్యాంగ్ స్టర్స్ అంటూ..

అసలైన గ్యాంగ్ స్టర్స్ అంటూ..

అక్కడే రెండు రోజుల పాటు ఉండి మోహన్ బాబుతో సరదాగా మాట్లాడుతూ సమయాన్ని గడిపాడు. ఇక మంచు విష్ణు వారితో ఇలా ఫొటో షూట్ నిర్వహించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. అసలైన గ్యాంగ్ స్టర్స్ అంటూ ట్యాగ్ ఇచ్చి మరింత వైరల్ అయ్యేలా చేశారు. ఇక భవిష్యత్తులో వీరి కాంబినేషన్ లో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X