చెన్నై రోడ్లపై కారును పరుగులు పెట్టించిన రజనీ.. లయన్ ఇన్ లంబోర్గిని అంటూ ట్రెండింగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం చేసినా అభిమానులకు వేడుకలా మారుతుంది. తాజాగా ఖరీదైన కారును సొంతంగా నడుపుతూ రోడ్డుపై కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ హుషారుగా కారును డ్రైవ్ చేసుకొంటూ వెళ్లడంతో అభిమానులు కేక పెట్టారు. చెప్పడమే కాదు.. నిబంధనలు ఆచరించడంలో రజనీ ముందు అందరూ దిగదుడుపే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రజనీ పేరుతో #LionInLamborghini హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. వివరాల్లోకి వెళితే..

 చెన్నై రోడ్డుపై పరుగులు పెట్టించిన రజనీ

చెన్నై రోడ్డుపై పరుగులు పెట్టించిన రజనీ

చెన్నై ప్రధాన రహదారిపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఖరీదైన లాంబోర్గిని కారును పరుగులు పెట్టించారు. కోవిడ్ భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రజనీ మాస్క్ ధరించి కారు నడుపుతూ అభిమానుల కంటపడ్డారు. సింపుల్‌గా తెల్లటి వస్త్రాలు ధరించిన రజనీకాంత్ స్వయంగా కారును డ్రైవ్ చేయడం గమనార్హం. రజనీ కారు నడుపుతున్న ఫోటో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

ముఖానికి మాస్క్, సీట్ బెల్ట్ ధరించి

ముఖానికి మాస్క్, సీట్ బెల్ట్ ధరించి

లాక్‌డౌన్‌లో గృహ నిర్బంధంలో ఉన్న రజనీకాంత్ ఒక్కసారిగా బయట కనిపించడంతో అభిమానులు థ్రిల్ అయ్యారు. కారు నడుపుకుంటూ వెళ్లడం, మాస్క్, సీట్ బెల్ట్ ధరించడంపై ప్రశంసలు వ్యక్తం చూస్తూ ట్వీట్ల మోత మోగించారు. మంచి వ్యక్తి నుంచి మంచి పోస్టు ఇది. కరోనా అంటే జోక్ కాదు. మాస్క్ ధరించాల్సిందే. మా హీరో లాంబోర్గిని కారులో సింహాంలో కనిపించారు. తన చెప్పడమే కాదు ఆచరించి కూడా చూపుతారు. అందుకే ఆయనను లీడర్ అంటారు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

 కూతురు ఫ్యామిలిని కలిసి..

కూతురు ఫ్యామిలిని కలిసి..

లాక్‌డౌన్‌లో రజనీకాంత్ అలా పనిగట్టుకొని రోడ్డుపైకి కారులో రావాల్సిన అవసరం ఏముందనే విషయం చర్చగా మారింది. అయితే ఆయన స్వయంగా కారును డ్రైవ్ చేసుకొంటూ నేరుగా తన కూతురు సౌందర్య రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. అక్కడ అల్లుడు, కూతురు, మనవడిని కలిసి ఫోటోకు ఫోజిచ్చారు. చాలా రోజులుగా కలువకుండా ఉన్న నేపథ్యంలో కూతురు కుటుంబాన్ని పరామర్శించినట్టు సమాచారం.

Recommended Video

Kushboo Made Comments on Rajinikanth's Political Entry
రజనీకాంత్ లేటేస్ట్ మూవీ

రజనీకాంత్ లేటేస్ట్ మూవీ

దర్బార్ సినిమా తర్వాత రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్బూ, మీనా, కీర్తీ సురేష్, ప్రకాశ్ రాజ్, నయనతార, సతీష్, సూరీ, వేల రామ్మూర్తి లాంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రజనీ కెరీర్‌లో 168వది కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X