For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rajinikanthలా ట్రై చేసిన జూనియర్ సూపర్ స్టార్: స్టంట్ చేస్తూ చివరకు పరువు పోగొట్టుకున్నాడుగా!

  |

  సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో తనదైన శైలి నటన, స్టైల్స్‌తో హవాను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే, మార్కెట్‌ను కూడా ఖండాంతరాలు దాటించుకున్నారు. ఇంతటి గొప్ప హీరోకు డూప్‌గా చేస్తూ ఫేమస్ అయ్యాడు ఓ అభిమాని. చూడ్డానికి అచ్చం సూపర్ స్టార్ రజినీకాంత్‌లా ఉండే అతడు.. తాజాగా ఓ స్టేజ్‌ షోలో ఆయనను అనుకరిస్తూ పరువు పోగొట్టుకున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  ప్రపంచానికి తెలిసిన రజినీకాంత్ స్టామినా

  ప్రపంచానికి తెలిసిన రజినీకాంత్ స్టామినా

  బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగిన హీరో రజినీకాంత్. దాదాపు నలభై ఏళ్లుగా సినీ రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తోన్న ఆయన.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. విలక్షణమైన నటన, విభిన్నమైన శైలి, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో తన స్టామినాను ప్రపంచానికి ఎప్పుడో పరిచయం చేశారు. తద్వారా యూనివర్శల్ స్టార్‌గా పేరు సంపాదించారు.

   ఆయనకు మాత్రమే ఆ రేంజ్‌లో స్పందన

  ఆయనకు మాత్రమే ఆ రేంజ్‌లో స్పందన

  సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇవి మాత్రమే కాదు.. జపాన్, మలేషియా వంటి దేశాల్లో ఫ్యాన్‌బేస్ కలిగిన ఇండియన్ హీరోగా రికార్డులకెక్కారు. అలాగే, ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్ని దేశాల్లో సెలవులు కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అదీ సూపర్ స్టార్ రజినీ రేంజ్‌ అంటే.

   ఎంతో మంది రజినీని అనుకరిస్తున్నారు

  ఎంతో మంది రజినీని అనుకరిస్తున్నారు

  రజినీకాంత్‌ను సినీ రంగంలో ఎంతో మంది ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన సినిమాలు చూసి హీరో అవ్వాలనుకున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాగే, సూపర్ స్టార్‌లా అనుకరిస్తూ.. డైలాగులు పలుకుతూ.. స్టైల్స్‌ను ఫాలో అవుతూ ఎంతో మంది అభిమానులు.. మిగిలిన వాళ్లందరికి మజాను పంచుతున్నారు. తద్వారా వాళ్లు కూడా ఎనలేని గుర్తింపును అందుకుంటున్నారు.

   రజినీకాంత్‌ను ఇమిటేట్ చేసిన అభిమాని

  రజినీకాంత్‌ను ఇమిటేట్ చేసిన అభిమాని

  తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అనుకరించే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఇందులో భాగంగానే ఓ ఫ్యాన్ అచ్చం తలైవాలాగే కనిపిస్తూ ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఎన్నో స్టేజ్ షోలు, ఈవెంట్లు చేస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ మధ్య అతడు కబాలీ సినిమాలో మాదిరిగా రజినీకాంత్ గెటప్ వేసుకుని ప్రదర్శన ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

  స్టంట్ చేస్తూ చివరకు పరువు పోగొట్టుకుని

  ఈ వీడియోలో రజినీకాంత్ డూపర్ అచ్చం తలైవాలానే కనిపిస్తూ సందడి చేశాడు. డైలాగులతో పాటు స్టైల్‌ను కూడా అచ్చు గుద్దినట్లు దించేశాడు. ఈ క్రమంలోనే స్టంట్ చేద్దామనుకుని పక్కనే ఉన్న కుర్చీని కాలితో తన్నాడు. అయితే, దానికి పెద్దం రంధ్రం ఏర్పడి అతడి కాలు అందులో ఇరుక్కుంది. దీంతో అదుపు తప్పి స్టేజ్ మీదే పడిపోయాడు. ఇక, పక్కనున్న వాళ్లు పైకి లేపారు.

  Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
   అన్నత్తేతో రాబోతున్న తలైవా రజినీకాంత్

  అన్నత్తేతో రాబోతున్న తలైవా రజినీకాంత్

  రజినీకాంత్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివతో కలిసి ‘అన్నత్తే' అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా ఆయన కంప్లీట్ చేసుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న దీన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం ఇస్తున్నారు.

  English summary
  Super Star Rajinikanth Has Huge Fan Base In The World. So Many Fans Imitate Him. Now One of the Rajinikanth Dupe Did The Stunt. But It was Not Success
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X