నీకు ఐశ్వర్యరాయ్‌తో రొమాన్సా? సీనియర్ హీరోను ముఖం మీదే తిట్టేసిన అభిమాని.. ఆ యాక్టర్ ఎవరో మీకు తెలుసా?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు ఇప్పుడు 73 ఏళ్లు. ఇప్పటికీ కూడా ఆయనకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇంతటి స్టార్ హీరో సరసన ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటిస్తోంది అంటే బచ్చన్ ఫ్యామిలీకి ఏమైంది అంటూ రజినీ ముందే మండిపడ్డాడు ఓ వ్యక్తి. రజినీకాంత్ ముందే అంతటి ధైర్యం చేసిన వ్యక్తి ఎవరు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇండియాతో పాటు ప్రపంచ దేశాలలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న ఆయన పట్ల ఇప్పటికీ కూడా ఏమాత్రం అభిమానం తగ్గలేదు మూవీ లవర్స్ కు. 2023లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'జైలర్' సినిమా అందుకు నిదర్శనం.

కానీ 14 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి రజనీకాంత్‌ను చాలా తక్కువ అంచనా వేశాడు. ఆ సంఘటనను రజనీకాంత్ ఏకంగా రోబో మూవీ వేదికపై పంచుకున్నారు. రజనీకాంత్‌కి ఐశ్వర్యరాయ్ జంటగా నటిస్తోంది అని చెప్పగానే.. ఓ రాజస్థానీ వ్యక్తి నమ్మలేకపోయాడట. అతను అది విని షాక్ అయ్యాడు అనే విషయాన్ని స్వయంగా రజనీకాంత్ స్టేజ్ పై వివరించారు.
నాతో హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించినందుకు ఐశ్వర్యరాయ్‌కి ధన్యవాదాలు అంటూ తన పట్ల ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరును వివరించారు. మా తమ్ముడి ఇల్లు బెంగళూరులో ఉంది. నేను ఓసారి అక్కడికి వెళ్ళాను. సమీపంలోని రాజస్థానీ కుటుంబం నన్ను చూడటానికి వచ్చింది. నందులాల్ అనే వ్యక్తి వచ్చి నాతో మాట్లాడాడు అని రజనీకాంత్ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు.

నందూలాల్ రజినీతో మాట్లాడుతూ వయసు 60 ఏళ్లు దాటింది. మీ జుట్టు ఏమైంది సార్ ? అని అడిగాడట. మొత్తం ఊడిపోయింది అంటూ రజినీకాంత్ కూడా నవ్వుతూ సమాధానం చెప్పారట. మీరు రిటైర్మెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారా? అని అతడు మరో ప్రశ్న వేశాడు. లేదు, నేను ఇప్పుడు ఒక సినిమాకు పని చేస్తున్నాను. ఐశ్వర్యరాయ్ హీరోయిన్ అని చెప్పారట రజినీకాంత్.
వావ్ వావ్.. ఐశ్వర్య చాలా మంచి నటి, మరి హీరో ఎవరు అని ఆ వ్యక్తి అడిగాడట. రజినీకాంత్ నేనే హీరోని అని చెప్పగా వాళ్లు నమ్మలేకపోయారని రజనీకాంత్ అన్నారు. కానీ నందులాల్ పిల్లలు అతనితో 'అవును నాన్న, ఇతనే హీరో' అని చెప్పారట.
తర్వాత 10 నిమిషాల పాటు నందూలాల్ అక్కడే ఉన్నా కూడా అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదట. అంతసేపు కూడా వాళ్ళు రజినీకాంత్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారట. తర్వాత బై బై చెప్పి వెళ్లిపోయారని రజినీ వెల్లడించారు.
కానీ ఆ తరువాత పక్క గదిలోంచి ఒక గొంతు వినిపించింది. ఐశ్వర్యరాయ్‌కి ఏమైంది? అభిషేక్ బచ్చన్ ఏమయ్యాడు? అమితాబ్ బచ్చన్ ఏమయ్యాడు? ఇతనితో ఆమె హీరోయిన్ గా ఎందుకు నటిస్తోంది? అంటూ నందూలాల్ ఫైర్ అయ్యాడట. 'రోబో' వేదికపై ఆ సంఘటనను రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











