దట్ ఈజ్ సూపర్ స్టార్.. ఆ రికార్డు రజనీకాంత్‌కు మాత్రమే సొంతం!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నేడు ఘనంగా విడుదల కాబోతోంది. శంకర్ రూపొందించిన ఈ విజువల్ వండర్ లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్, రజని, అక్షయ్ కుమార్ విన్యాలు ఎంజాయ్ చేయడం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ రోజు రానే వచ్చింది. అన్ని ప్రాంతాల నుంచి ఈ చిత్రానికి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి.
ఇదిలా ఉండగా 2.0 చిత్రంతో సూపర్ స్టార్ రజనీకాంత్ మరే భారతీయ నటుడికి సాధ్యం కానీ ఘనత సొంతం చేసుకున్నారు. 2.0 చిత్రాన్ని త్రీడి ఫార్మాట్ లో రూపొందించారు. ఇండియన్ సినిమాలోని అన్ని ఫార్మాట్ లలో నటించిన ఏకైక నటుడిగా రజని అవతరించారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ సినిమా, మోషన్ క్యాప్చర్ సినిమా, త్రీడి ఇలా అన్ని ఫార్మట్స్ లో నడిచిన ఏకైన నటుడిగా రజనీకాంత్ రికార్డు సృష్టించారు.

రజనీకాంత్, దీపికా పదుకునే జంటగా నటించిన కొచ్చాడియాన్ చిత్రం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శత్వం వహించారు. 2.0 విడుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రజనీకాంత్ అభిమానుల్లో కోలాహలం నెలకొంది.


Click it and Unblock the Notifications











