For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజినీకాంత్ డేరింగ్ స్టెప్: క్లిష్ట సమయంలో అలాంటి సాహసం.. ఫ్యాన్స్‌లో పెరిగిన ఆందోళన

  |

  దాదాపు నలభై ఏళ్లుగా విలక్షణమైన నటనతో, విభిన్నమైన స్టైల్స్‌తో సత్తా చాటుతూ దక్షిణాదిలోనే స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో రకాల చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఏజ్ బార్ అవుతున్నా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సీనియర్ హీరో 'అన్నత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ కోసం రజినీకాంత్ డేరింగ్ స్టెప్ వేయడానికి సిద్ధం అయ్యారని ఓ న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  ‘అన్నత్తే’ అంటూ వస్తున్న రజినీకాంత్

  ‘అన్నత్తే’ అంటూ వస్తున్న రజినీకాంత్

  సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం ‘అన్నత్తే'. మాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సిరుత్తి శివ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోన్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత ఇస్తున్నారు.

  Narappa Success Meetలో నోరు జారిన వెంకటేష్: ప్రకటనకు ముందే లీక్.. సాహసం చేస్తున్నారుగా!

  ఎప్పుడో మొదలు.. వరుసగా బ్రేకులు

  ఎప్పుడో మొదలు.. వరుసగా బ్రేకులు

  ‘అన్నత్తే' సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. అయితే, మధ్యలో కరోనా లాక్‌డౌన్ రావడం.. ఆ తర్వాత రజినీకాంత్‌ అనారోగ్యానికి గురి కావడంతో చిత్రీకరణకు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఈ ఏడాది షూటింగ్‌ను పున: ప్రారంభించినా మరోసారి కోవిడ్ ప్రభావంతో బ్రేక్ పడిపోయింది. దీనికితోడు రజినీ పర్సనల్ పనులతో ఈ సినిమా షూట్ సజావుగా సాగడం లేదనే చెప్పాలి.

  ఫైనల్ షెడ్యూల్ కోల్‌కతాలో ప్రారంభం

  ఫైనల్ షెడ్యూల్ కోల్‌కతాలో ప్రారంభం

  సుదీర్ఘ విరామం తర్వాత ‘అన్నత్తే' ఫైనల్ షెడ్యూల్ ఇటీవలే కోల్‌కతాలో ప్రారంభం అయింది. ఇది షెడ్యూల్ దాదాపు ఇరవై రోజులు ప్లాన్ చేశారని అంటున్నారు. అక్కడ కాళికా దేవి టెంపుల్ ఆవరణలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అంతేకాదు, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ఇక్కడే షూట్ చేయబోతున్నారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

  అదే సెంటిమెంట్‌తో.. తెలుగులో ఇలా

  అదే సెంటిమెంట్‌తో.. తెలుగులో ఇలా

  రజినీకాంత్ - శివ కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమాకు తమిళంలో ‘అన్నత్తే' అనే టైటిల్ పెట్టారు. తెలుగులో ఏదైనా పేరు పెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రం కోసం ‘అన్నయ్య' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనికి కారణం ఇది అన్నా చెల్లెలి సెంటిమెంట్‌తో రాబోతుండడమే. ఇందులో కీర్తి సురేష్.. రజినీ చెల్లెలిగా నటిస్తోంది.

  ఘాటు ఫొటోలతో రెచ్చిపోయిన హెబ్బా పటేల్: అబ్బా అనిపించేలా ఫోజులు.. మామూలుగా లేవుగా!

  Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
  అన్నత్తే కోసం రజినీకాంత్ డేరింగ్ స్టెప్

  అన్నత్తే కోసం రజినీకాంత్ డేరింగ్ స్టెప్

  కోల్‌కతాలో జరుగుతోన్న ఫైనల్ షెడ్యూల్‌లో కొద్ది రోజుల్లో క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను షూట్ చేయబోతున్నారు. దీని కోసం దాదాపు వంద మంది వరకూ ఫైటర్లు, ఆర్టిస్టుల అవసరం ఏర్పడిందట. కరోనా సమయం కావడంతో ఇది షూట్ చేయడానికి చిత్ర యూనిట్ పునరాలోచనలో పడిందని తెలిసింది. కానీ, రజినీకాంత్ మాత్రం డేర్ చేస్తున్నారని టాక్. దీనిపై ఆయన ఫ్యాన్స్ మాత్రం తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

  English summary
  Super Star Rajinikanth Now Doing Annaatthe Movie Under Mass Director Siva Direction. Super Star Ready to do Risk for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X