twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతిగా ఆశ పడను.. రిస్క్ ఎందుకు.. రీ ఎంట్రీపై రాంచరణ్ షాకింగ్ కామెంట్స్

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు. రంగస్థలం చిత్రం నాన్ బాహుబలి క్యాటరిగిలో ఉత్తమ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాపంగా రూ.200 కోట్లకుపైగా భారీ కలెక్షన్లు సాధించింది. అయితే స్టార్ స్టామినా పెరిగినా గత కొద్దికాలంగా రాంచరణ్ బాలీవుడ్‌కు దూరంగా ఉంటారు. తాజాగా వినయ విధేయ రామ ప్రమోషన్‌లో భాగంగా రాంచరణ్ మాట్లాడుతూ సినిమా విషయాలను వెల్లడించారు.

    బాలీవుడ్ రీ ఎంట్రీ గురించి

    బాలీవుడ్ రీ ఎంట్రీ గురించి

    బాలీవుడ్‌ రీ ఎంట్రీపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బాలీవుడ్ రంగానికి వెళ్లడంపై ఆలోచించడం లేదు. ఇక్కడే బ్రహ్మండమైన కలెక్షన్లు వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఎంత వస్తుందో తెలుగులో వస్తున్నది. అక్కడికి వెళ్లి రిస్క్ చేయడం కష్టమే అని అన్నారు.

    తెలుగు సినిమానే ముఖ్యమని

    తెలుగు సినిమానే ముఖ్యమని

    ఇక ముందు కూడా నాకు తెలుగు సినిమానే నాకు ముఖ్యం. సౌత్ ఇండియా వరకే నా ప్రాధాన్యత. అంతకుమించి ఆశపడటం నాకు ఇష్టం లేదు. నాకు అతిగా ఆశపడటం కంటే సుఖంగా రిలాక్స్‌గా ఉండటమే ఇష్టం అని రాంచరణ్ అన్నాడు.

    జంజీర్ చిత్ర రీమేక్‌లో

    జంజీర్ చిత్ర రీమేక్‌లో

    గతంలో అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాను రీమేక్‌గా అదే పేరుతో బాలీవుడ్ రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రియాంక చోప్రా జంటగా నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడటంతో మళ్లీ బాలీవుడ్ ముఖం చూడలేదు.

    వినయ విధేయ తర్వాత RRR మూవీ

    వినయ విధేయ తర్వాత RRR మూవీ

    రంగస్థలం సినిమా తర్వాత రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం జనవరి 11న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో కియారా అద్వాని, వివేక్ ఒబేరాయ్ నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందించారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రంలో నటిస్తున్నారు.

    English summary
    Mega Powerstar Ram Charan latest movie is Vinaya Vidheya Rama. This movie set to release on January 11th. In this occassion, Ram Charan speaks to Telugu Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X