ముందుంది మంచి కాలం.. రామ్ చరణ్ పోస్ట్ వైరల్

ప్రస్తుతం ప్రపంచం గడ్డు పరిస్థితిని ఏదుర్కొంటోంది. కరోనా కోరల్లో చిక్కుని బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఏడాదిపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఘనంగా స్వాగతం పలికిన మానవాళికి ఎదురుదెబ్బ తగిలింది. భయంకరమైన కరోనా వైరస్ భారిన పడి కొట్టుమిట్టాడుతున్నాము. మన దేశంలోనూ అదే పరిస్థితి. మనకూ కాలం కలిసి రావడం లేదు. ఓ వైపు కరోనా విజృంభిస్తూ ఉంటే మరోవైపు విశాఖ గ్యాస్ లీక్ ఘటన మరింత కుంగదీస్తోంది. వీటన్నింటిపై రామ్ చరణ్ స్పందిస్తూ.. ఆశలు చిగురించేలా ఓ పోస్ట్ చేశాడు.

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రామ్ చరణ్ స్పందిస్తూ.. 'విశాఖ గ్యాస్ లీక్ ఘటన దృశ్యాలను చూసి నా హృదయం బద్దలైంది. మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారిని త్వరగా కోలుకునేలా చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఆశిస్తున్నాను. విశాఖ ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నా'ని ట్వీట్ చేశాడు.

Ram Charan About Buddha Purnima

తాజాగా మరో పోస్ట్ చేస్తూ.. 'ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన దినోత్సవం. నేడు బుద్ద పూర్ణిమ. మనలో ఉన్న నెగెటివిటీని పూర్తిగా తీసేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. పాత అలవాట్లను మానుకోండి. నిశ్శబ్దంగా ఉండండి.. ముందుంది మంచి కాలం' అంటూ ఆర్ఆర్ఆర్ స్టిల్‌ను పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X