ఉప్పెన విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ గ్రేట్.. పవర్‌స్టార్ పేరు చెబుతూ రాంచరణ్ ఎమోషనల్

ఉప్పెన సినిమా కథ విన్నప్పటి నుంచి రిలీజ్ వరకు మెగాస్టార్ చిరంజీవి చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. సినిమా యూనిట్‌కు మొదటి నుంచి భరోసా ఇస్తున్నారు. ఉప్పెన విజయంపై రిలీజ్‌కు ముందే మెగాస్టార్ జోస్యం చెప్పారు. అదే విషయాన్ని ఉప్పెన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ చెబుతూ...

Recommended Video

Uppena Success Meet: Ram Charan Praises Vaishnav tej performance
ఏ హీరోకు దక్కని విజయం వైష్ణవ్ తేజ్‌కు

ఏ హీరోకు దక్కని విజయం వైష్ణవ్ తేజ్‌కు

మా కుటుంబంలోనే కాకుండా ఇండస్ట్రీలో ఏ డెబ్యూ హీరోకు దక్కని రికార్డులు వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబుకు లభిస్తున్నాయి. ఇలాంటి వసూళ్లు రావడం వల్ల సినిమా పరిశ్రమకు ఎంతో మేలు చేస్తున్నది. కొత్తవాళ్లను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ రాంచరణ్ అన్నారు

పవన్ కల్యాణ్ గురువుగా మారి

పవన్ కల్యాణ్ గురువుగా మారి

వైష్ణవ్ తేజ్ సినిమాల్లోకి రావాలనుకొన్నప్పుడు నాన్నగారు చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్ ప్రోత్సాహించారు. చిరంజీవి గారికి వచ్చి తన మనసులో మాట చెప్పినప్పుడు పూర్తిగా ప్రోత్సాహం అందించారు. వైష్ణవ్ తేజ్‌కు గురువుగా మారి విదేశాలకు పంపించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటనలో శిక్షణ ఇప్పించారు అని వైష్ణవ్ తేజ్ తెలిపారు.

మా జీవితాల్లో మెగాస్టార్, పవర్ స్టార్ ఉండటం

మా జీవితాల్లో మెగాస్టార్, పవర్ స్టార్ ఉండటం

వైష్ణవ్ తేజ్‌ లైఫ్‌లో చిరంజీవి, పవన్ కల్యాణ్ ఉండటం నిజంగా అదృష్టం. మా జీవితాల్లో కూడా ఆ ఇద్దరు ఉండటాన్ని గర్వంగా ఫీలవుతున్నాం. వైష్ణవ్ తేజ్ సినిమా కోసం చిరంజీవి గారూ చాలా శ్రద్ద పెట్టారు. నాలుగు సార్లు కథ విన్నారు. ఆయన జడ్జ్‌మెంట్ పూర్తిగా వర్కవుట్ అయింది అని రాంచరణ్ అన్నారు.

సినిమా హిట్ అని చిరంజీవి ముందుగానే..

సినిమా హిట్ అని చిరంజీవి ముందుగానే..

ఉప్పెన సినిమాను రిలీజ్‌కు రెండు రోజుల ముందే చిరంజీవి గారు సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత నిర్మాతలకు సినిమా హిట్ అవుతుందని భరోసా ఇచ్చారు. ఆయన నమ్మకం నిజమైంది. నాకు ఇలాంటి హిట్ రావడానికి, పెర్ఫార్మెన్స్ చేయడానికి ఏడేళ్లు పట్టింది. వైష్ణవ్ తేజ్‌కు తొలి సినిమాకే లభించింది అని రాంచరణ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X