నాన్న అలా చేస్తారని అనుకోలేదు.. ఉపాసన తిండిపెట్టకుండా చంపేది.. రాంచరణ్
వినయ విధేయ రామ చిత్రంలోని పాత్ర కోసం రాంచరణ్ శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించారు. రంగస్థలం చిత్రం తర్వాత మరోసారి మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జనవరి 11న తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో సినిమా గురించి, బోయపాటి మేకింగ్ స్టైయిల్, చిరంజీవి గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. రాంచరణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

పాత్ర పేరు బోయపాటి చెబితే
వినయ విధేయ రామలో నా పాత్రపేరు కొణిదెల రామ్. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ విషయం చెప్పినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ ఆ తర్వాత చేశాను. ఆ విషయం తెలిసి నా పర్మిషన్ లేకుండా ఎలా వాడారు అని సరదాగా బోయపాటికి ఝలక్ ఇచ్చారు. నాన్నకు కూడా నా పాత్ర పేరు నచ్చింది.

నాకంటే చిరంజీవి గారే బాగా
వినయ విధేయ రామ చిత్ర ఆడియో ఫంక్షన్‌లో టీజర్‌లోని నాన్న చిరంజీవి బాగా చెప్పారు. అలా చెబుతారని నేను అనుకోలేదు. షాకింగ్ అనిపించింది. నా కంటే చాలా బాగా చెప్పారు. నా కంటే పదిరెట్టు బాగా చెప్పారని అనుకొంటున్నాను. ఏది ఏమైనా నా సినిమాకు ప్రమోషన్‌గా పనికివచ్చింది.

తక్కువ సమయంలో ఎక్కువ శ్రమ
వినయ విధేయ రామ సినిమా కోసం సిక్స్ ప్యాక్ కష్టపడ్డాను. సమయంలో లేకపోవడంతో తక్కువ టైమ్‌లోనే నేను బోయపాటి శ్రీను కోరుకొన్న విధంగా తయారయ్యాను. అందుకు సల్మాన్ ఖాన్ పర్సనల్ ట్రైనర్ నాకు సహకరించారు. డైట్ అవన్నీ బాగా మెయింటెన్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా అజర్ బైజాన్‌ల జీరో డిగ్రీల ఉష్ణోగ్రతలో షూట్ చేశాం.

శరీరాకృతిని మార్చుకోవడం
ప్రతీ సినిమాకు శరీరాకృతిని మార్చుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది. నేను ఎక్కువగా ఇబ్బంది పడలేదు. ఉపాసన నాకు చాలా కష్టంగా ఆహారం పెట్టేంది. కాల్చిన చేపలు లాంటివి అందించేవారు. అవన్నీ తినడం ఓ దశలో చాలా కష్టమనిపించింది. ఇంట్లో భోజనం చాలా తృప్తిగా ఉంటుంది. సినిమా కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











