twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ram Charan Tej డ్రీమ్ ప్రాజెక్ట్.. కోరుకున్న వెంటనే మరో పాన్ ఇండియా మూవీ!

    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమాతో నేవర్ బిఫోర్ నేల బాక్సాఫీస్ వద్ద మరోసారి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత వినయ విధేయ రామ సినిమాతో కాస్త డిజాస్టర్ ఎదురైనప్పటికీ కూడా మెగా పవర్ స్టార్ స్టార్ హోదా అయితే ఏ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ప్రస్తుతం అంతకుమించి సక్సెస్ అయ్యే సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ముందుగా ఇండియన్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ RRR సినిమా తో రాబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో అలరించబోతున్నాడు.

    RRR సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తప్పకుండా ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ పాత రికార్డులను బ్రేక్ చేస్తుందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అజయ్ దేవ్ గన్ అలియా భట్ కూడా ప్రధాన పాత్రలో నటించడంతో సినిమాపై బాలీవుడ్ లో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ తేజ్ స్థాయి మాత్రం అన్ని భాషల్లో పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్టులు కూడా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలని కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో మరొక పాన్ ఇండియా సినిమాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

    Ram charan about his dream project as sports backdrop

    ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ తేజ్ మొదటిసారి ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు అని అలాగే రెండు విభిన్నమైన షేడ్స్ ను చూపించబోతున్న ట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తేజ్ ఇటీవల జెర్సీ దర్శకుడు తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అసలైతే ఈ ప్రాజెక్టు గత ఏడాది లోనే అఫిషియల్ గా అనౌన్స్ చేయాలని అనుకున్నారు. కానీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి ఒక కమిట్మెంట్ ఉండడం వలన కాస్త ఆలస్యంగానే తెరపైకి వచ్చింది. గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమా తర్వాత అదే కథను మళ్లీ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు.

    దాదాపు సినిమా షూటింగ్ అయితే పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక లాక్ డౌన్ సమయంలోనే దర్శకుడు మరొక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథను రెడీ చేసుకున్నాడు. అయితే గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తేజ్ తనకు ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథను చేయాలని ఉందని చెప్పాడు. ఇక అలాంటి కథ ఏదైనా సరే నచ్చితే మాత్రం తప్పకుండా సినిమా చేసేందుకు ఒప్పుకుంటానని కూడా అన్నాడు. ఇక రామ్ చరణ్ తేజ అలా కోరుకున్న ఏడాదిలోనే గౌతమ్ తిన్ననూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ను అతని ముందు ఉంచాడు. మరి రామ్ చరణ్ తేజ్ ఆ జానర్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Ram charan about his dream project as sports backdrop
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X