Ram Charan ఉపాసన కడుపులో బిడ్డ నాకు లక్కీ.. రాంచరణ్ ఎమోషనల్
ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటిన తర్వాత మెగా పవర్ రాంచరణ్ ఇండియాకు చేరుకొని నేరుగా ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంచరణ్ మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకొన్నారు. ఆయన అడిగిన ప్రశ్నలకు రాంచరణ్ సమాధానాలు ఇస్తూ..

ఆస్కార్ పొందడం అపురూపమైన విషయం. మన సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచిందన్న విషయాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను. నన్ను నేను గిల్లిచూసుకుంటున్నాను. నా భార్య నా లక్కీ మస్కాట్. ఆమె కడుపులో ఉన్న ఐదు నెలల శిశువు నాకు ఇంకా లక్కీ. త్వరలోనే తండ్రిని కాబోతున్నాను. అన్నీ మంచి విషయాలు ఒకసారే జరుగుతున్నాయి అని రాంచరణ్ అన్నారు.
ప్రస్తుత జనరేషన్‌లో రీజినల్ సినిమా అనేదే ఉండదు. ఇప్పటిదాకా మనకు వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఎన్నో రీజినల్ సినిమా ఇండస్ట్రీలు ఉండేవి. కానీ ఇప్పుడు సరిహద్దులు చెరిగిపోయాయి. మూలాల్లోకి వెళ్లి కథలను పట్టుకోగలగాలి. మగధీర అలాంటి సినిమానే. లగాన్ అలాంటి సినిమానే. కొరియా పారసైట్ ఆ తరహా సినిమానే. మట్టి కథను, పోరాటాల కథలను చెప్పగలిగినప్పుడు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు వస్తాయి. గ్లోబల్ ఆడియన్స్ మన సినిమాలను ఇండియన్ సినిమాలను ఒక్క సినిమాగా చూడగలగాలి అని రాంచరణ్ తెలిపారు.
నెపోటిజం మీద జరుగుతున్న చర్చ నాకెప్పుడూ అర్థం కాదు. అందరూ అంటారు కాబట్టి మిగిలినవారు కూడా అంటుంటారేమో. అసలు అందులోని లైన్ల గురించి ఎంత మంది అర్థం చేసుకుంటారో కూడా ఊహించలేం. ప్రఖ్యాత జర్నలిస్టు పిల్లలు జర్నలిస్టు కావాలనుకుంటారు. తల్లిదండ్రుల బాటలో పిల్లలు నడవాలనుకోవడం మనకు ఎప్పటి నుంచో వస్తున్నదే. నాకు సినిమా అంటే పంచప్రాణాలు. నేను పుట్టినప్పటినుంచే ఫిల్మ్ స్కూల్లో ఉన్నా. నాకు ఆ కళ తెలుసు. నేను పనిని సక్రమంగా చేయకపోతే ఈ ఇండస్ట్రీలో ఉండలేను. తల్లిదండ్రులు ఈ రంగంలో పేరు ప్రఖ్యాతులతో ఉంటే, ఒక్కడుగు ధైర్యంగా వేయగలుగుతారేమో! కానీ, తదనంతరం మన టాలెంటే మాట్లాడుతుంది. కేజీయఫ్ స్టార్ యష్ తండ్రి స్టార్ కాదు. కానీ ప్రతిభను ఎవరూ ఆపలేరు. ఎవరి విషయంలోనైనా అదే చెల్లుతుంది అని రాంచరణ్ పేర్కొన్నారు.
నా భార్య ఉపాసన షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్. నేను సల్మాన్ ఖాన్ ఫ్యాన్. నేను ఇప్పటిదాకా సినిమాల్లో ఎవరినీ అనుకరించలేదు. విలక్షణం అనేది నటుడికి చాలా కీలకం. ఎవరి శైలి వాళ్లకు ఉన్నప్పుడే రాణిస్తారు అని రాంచరణ్ తలిపారు.
నేనిప్పుడు శంకర్‌తో సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. రంగస్థలం సినిమాను మించిన మరో సినిమాలో బెస్ట్ పాత్ర చేస్తాను. ఆ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ నుంచి ఉంటుంది. పాశ్చాత్యదేశాల్లోనూ ఆ సినిమాను అంగీకరిస్తారనే నమ్మకం ఉంది అని రాంచరణ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











