ఒక ప్రాణం తీస్తే మీ పరువు నిలబడిందా? ప్రణయ్ హత్యపై రామ్ చరణ్!

సంచలనం సృష్ఠించిన మిర్యాలగూడ పరువు హత్యపై సామాన్య ప్రజల దగ్గర నుండి సెలబ్రిటీలు వరకు స్పందిస్తున్నారు. ఇప్పటి‌కే కొందరు సినీ సెలబ్రిటీలు ఈ విషయమై రియాక్ట్ అవ్వగా. తాజాగా ఈ లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేశారు. తన మూవీ ఆర్‌సి12 షూటింగులో భాగంగా యూరఫ్‌లోని అజ‌ర్ బైజాన్‌ అనే ప్రాంతంలో ఉన్న రామ్ చరణ్ ప్రణయ్ హత్య గురించి తెలుసుకుని దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ సంఘటనపై తన మనసులోని భావాలను వ్యకపరుస్తూ ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు.

అతడిని చంపడం వల్ల మీ పరువు నిలబడిందా?

అతడిని చంపడం వల్ల మీ పరువు నిలబడిందా?

ఈ పరువు హత్య గురించి తెలియగానే చాలా బాధేసిందని చెప్పిన రామ్ చరణ్... కుల వ్యవస్థ మీద అసహ్యం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రాణం తీయడం వల్ల మీ పరువు నిలబడిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాజం ఎక్కడికి వెళుతోంది?

సమాజం ఎక్కడికి వెళుతోంది?

ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడల్లా.... మన సమాజం ఎక్కడికి వెళుతుందా? అనే భావన కలుగుతుంది. పరువు హత్యలు అనేది అత్యంత దారుణం, ఈ కాలంలోనూ ఇలాంటివి చోటు కోవడం దురదృష్టకరం... అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

 ప్రణయ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

ప్రణయ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

ఈ ఘటనపై రామ్ చరణ్.... ప్రణయ్ కుమార్ భార్య అమృత వర్షిని, అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

 సంచలనం రేపిన సంఘటన

సంచలనం రేపిన సంఘటన

నల్లగొండజిల్లా మిర్యాలగూడలో సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ కుమార్ అనే దళిత యువకుడు హత్యకు గురయ్యాడు. అగ్రకులానికి చెంది అమృత వర్షిణిని అతడు ప్రేమ వివాహం చేసుకోవడంతో కక్ష పెంచుకున్న అమృత తండ్రి మారుతీరావు కుతురు ముందే ప్రణయ్‌ను హత్య చేయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X